నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా వారి కోసం పని చేస్తానని రోజా చెబుతున్నారు. టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకోపయినా తాను జగనన్నకు ప్రాణం ఇస్తానని రోజా చెప్పుకొచ్చారు. కానీ ఆమె తాను చేసిన కృషిని కూడా వెంటనే చెప్పుకొచ్చారు. ప్రతి రోజు నగరి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్తూ, సంక్షేమ పథకాలను అందిస్తూ పల్లె నిద్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని తక్షణమే వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
క్యాబినెట్ సమావేశంమైనా, పార్టీ కార్యక్రమాలైనా ఎప్పుడూ నేను ముందు ఉంటానని తెలిపారు. టీడీపీ అనుకూల మీడియా దిగజారుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. టిక్కెట్ రాదని చెప్పి టీడీపీకి వైసీపీ అభ్యర్థులను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జగనన్నపై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో, అంతకు మూడింతలు పార్టీలో మా అందరికీ ప్రేమ ఉందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి 100% అందరూ కలిసిమెలిసి పని చేస్తామన్నారు..
కేవలం తనకు టిక్కెట్ రాదని… టీడీపీ అనుకూల మీడియానే ప్రచారం చేస్తోందని రోజా అంటున్నారు. కానీ ఆమెకు అసలు నిజం తెలియకుండా ఉండదని సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. నగరిలో పెద్దిరెడ్డి వర్గానికి.. రోజాకు సరిపడటం లేదు. పెద్దిరెడ్డి ఆమెకు టిక్కెట్ రాకుండా చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని తెరపైకి తెస్తున్నారు. అయినా రోజా … తనకు భ యపడి అయినా సరే టిక్కెట్ ఇస్తారని.. భావిస్తున్నారు. అందులో భాగంగానే… బెదిరింపు స్వరంతో విధేయతా ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు.
టిక్కెట్ రాకపోతే రోజా చేసే రచ్చ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి.. అనేక తలనొప్పుల మధ్య రోజా ఇష్యూ ఎందుకని జగన్ అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.