ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లుగా పార్టీ హైకమాండ్ కు తెలిపారు. మైలవరం సీటును మంత్రి జోగి రమేష్ కు కేటాయించారు. వసంత కృష్ణ ప్రసాద్ ను.. జగ్గయ్య పేట నుంచి పోటీ చేయాలని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దీనికి ఆయన అసంతృప్తికి గురయ్యారు. పార్టీ హైకమాండ్ కు అందుబాటులోకి రాకుండా వెళ్లిపోయారు. తాను పోటీ చేయడానికి సిద్ధంగా లేనని సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది.
మాట్లాడుకుందాం.. సీఎం క్యాంప్ ఆఫీసుకు రావాలని ఆయనకు సమాచారం పంపినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆయన ను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో వర్గ పోరాటం చాలా కాలంగా ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ ను జోగి రరమేష్ వర్గం పదే పదే అవమానిస్తున్నా సీఎం పట్టించుకోలేదు. ఇప్పుడు టిక్కెట్ కే ఎసరు పెట్టారు. మైలవరంలో మొదట జోగి రమేష్ ఇంచార్జ్ గా ఉండేవారు.
గత ఎన్నికలకు ముందు ఆయనను పెడనకు పంపించి.. వసంత కృష్ణప్రసాద్ కు టిక్కెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు. కానీ మళ్లీ మైలవరం నంచేపోటీ చేయాలని జోగి రమేష్ కోరుకుంటున్నారు. జగన్ కు ఇష్టం లేని వాళ్లందర్నీ బూతులు తిట్టి ఆయనను రంజింప చేయడంలో జోగి రేమేష్ ముందుంటారు. అందుకే వసంతను పక్కన పెట్టి జోగికే మైలవరం కేటాయించారు.