రవితేజ ‘ఈగల్’ సినిమా పండక్కి వస్తుందని నిర్మాణ సంస్థ అనేక సందర్భాల్లో ప్రకటించింది. కానీ సినిమా పై కొందరు చాలా గాసిప్పులు పుట్టించారు. ఈగల్ పండక్కి డ్రాప్ అయిపోతుందని, టైగర్ నాగేశ్వరరావు వచ్చి రెండు నెలలు కాకముందే మరో సినిమా చూస్తారా? సంక్రాంతి రేసులో అవసరమా ? చివరి నిమిషంలో సినిమా డ్రాప్ అయిపోచ్చని.. ఇలా పలు కథనాలు వినిపించారు. కానీ ఇవన్నీ గాసిప్పులే. ఇప్పుడీ విషయంలో రవితేజ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
ఈ రోజు ఈగల్ ట్రైలర్ లాంచ్ జరిగింది. ట్రైలర్ లో యాక్షన్ ఎమోషన్స్ సస్పెన్స్ అన్నీ వున్నాయి. రవితేజ కొత్తగా కనిపిస్తున్నారు. డైలాగ్స్ లో ఎలివేషన్లు బావున్నాయి. కొత్త దర్శకుడు కార్తిక్ కొత్త పాయింట్ ఎదో పట్టుకున్నాడనిపించింది ట్రైలర్ చూస్తే. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రవితేజ స్పీచ్ గమనిస్తే.. సంక్రాంతి వస్తున్నామని తన వంతుగా కూడా స్పష్టం చేశారు. ‘’జనవరి 13.. థియేటర్స్ లో కుమ్మేద్దాం’’ అని తనదైన శైలిలో ఫ్యాన్స్ కి హుషారెక్కించారు రవితేజ.