ప్రజలు అధికారం ఇచ్చి వాళ్లను అడ్డగోలుగా దోచుకోవడానికి.. వారు కట్టిన పన్నుల్ని సొంత ఖజానాకు తరలించుకోవడానికి అని ఏపీ సీఎం జగన్ రెడ్డికి గట్టి నమ్మకం అనుకోవాల్సిందే. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ప్రభుత్వం సాక్షి పత్రికకు పండగ చేసింది. అన్ని డిపార్టుమెంట్లు, కార్పొరేషన్లు ప్రకటనతో హోరెత్తించారు. కనీసం రూ. వంద కోట్లు జగన్ పుట్టిన రోజు పేరుతో సాక్షి ఖాతాకు తరలించి ఉంటారని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరైనా ఓ సీఎం తన కుటుంబానికి చెందిన వ్యక్తికో.. సంస్థకో ఓ రూపాయి పని ఇవ్వాలంటే.. సిగ్గుపడతారు. అది నైతికత కాదని అనుకుంటారు.
ప్రజాధనం ముట్టుకోకూడదనుకుంటారు. కానీ జగన్ రెడ్డికి అలాంటి నైతికత ఏమీ ఉండదు. సొంత పత్రికకు వందల కోట్లు ధారదత్తం చేస్తూంటారు. ఐదేళ్లలో ఎన్ని వందల కోట్లు అలా సాక్షి పత్రికకు చేరి ఉంటాయో అంచనా వేయడం కష్టం. సీఎంగా చివరి పుట్టిన రోజున విశ్వరూపం చూపించారు. ఇక ఆయన వల్ల లబ్దిపొందిన కంపెనీలు.. యథా ప్రకారం క్విడ్ ప్రో కో ను ప్రకటనల రూపంలో సమర్పించుకున్నాయి. ఓ వైపు అంగన్ వాడి మహిళలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జీతం పెంచాలని అడుగుతూంటే.. వాళ్లపై ప్రతాపం చూపిస్తున్నారు.
అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఉంటే..తాను మాత్రం గొప్పగా వేడుకలు చేసుకుంటన్నారు. అచ్చమైన రాచరిక పోకడలకు పోతున్నారు. ప్రజాధనాన్ని ఇంత ఘోరంగా సొంత ఖాతాలకు మళ్లించుకునే రాజకీయ నాయకుడు.. ఇంతకు ముందు ఉండరు.. భవిష్యత్లో రారన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.