తెలుగుదేశం పార్టీకి మద్దతుగా… ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపే ఎన్నారై యశస్వి బొద్దులూరి తన తల్లిని పరామర్శించడానికి ఇండియాకు రాగానే ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వస్తున్నారని తెలుసుకుని ప్రత్యేకంగా కాన్వాయ్ వేసుకుని హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఎయిర్పోర్టులో దిగగానే అదుపులోకి తీసుకున్నారు.
యశ్ బొద్దులూరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారంతే. లండన్ లో ఉండే ఆయన తన స్వరాష్ట్రంలో అరాచకపాలనను. అడ్డగోలు విధానాలు.. పేదలను పీడించుకునే ప్రభుత్వ పెద్దల నిర్వాకాన్ని గట్టిగా ప్రశ్నిస్తారు. అందుకే కోపం పెంచుకున్నారు. ఆయనపై ఎప్పుడు కేసులు పెట్టారో ఎవరికీ తెలియదు. ఎన్ని సార్లు కోర్టుల్లో చివాట్లు పడినా… పోలీసులు మాత్రం మారరు. ప్రభుత్వ పెద్దలు పెట్టుకుని సిల్లీ కక్షలను అమలు చేయడానికి వారు రంగంలోకి దిగాల్సింది. అదే జరిగింది.
మనకు రాజ్యాంగం.. వాక్ స్వేచ్చను ఇచ్చింది. దీన్ని వైసీపీ వాళ్లకు మాత్రమే పరిమితం చేసి.. వాళ్లు మాత్రం అందర్నీ అడ్డగోలు బూతులు తిట్టొచ్చు.. తమను మాత్రం ఎవరైనా చిన్న మాట అంటే… ప్రభుత్వంపై కుట్ర.. వర్గాల చిచ్చు.. అంటూ రకరకాల సెక్షన్ల కింద కేసులు పెట్టేస్తారు. ఈ రకమైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు చేసినా ప్రయత్నాలను కోర్టులు ఎన్నో సార్లు కొట్టేశాయి. పోలీసుల సిగ్గుపోయింది. చివరికి కార్టూనిస్టునే కాదు.. సోషల్ మీడియా పోస్టుల్ని షేర్ చేసిన వారినీ వదల్లేదు. అయినా వారందర్నీ అరెస్టు చేసి..కోర్టు దాకా తీసుకెళ్లగలరు..కానీ అక్కడ షాక్ మాత్రం పోలీసులకే.
ఎలాగోలా అదుపులోకి తీసుకున్నామని చెప్పడానికి తప్ప.. పోలీసులు ఇందులో నేరం ఏమిటో నిరూపించలేరు. కానీ…. సిక్ మైండ్ తో ఉన్న ప్రభుత్వ పెద్దల సిల్లీ కక్షలకు పోలీసులు ఇలా టార్చర్ పడాల్సిందే. యశ్ బొద్దులూరికి మద్దతు టీడీపీ మొత్తం కదిలింది. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తోంది.