తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు సైలెంట్ గా హోమాలు పూర్తి చేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు ఈ క్రతువుల్లో పాల్గొన్నారు. మరికొన్ని హోమాలు కూడా జడరగనున్నాయి. ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానుండడం, ఇటీవల చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడం, నారా లోకేశ్ యువగళం విజయవంతంగా ముగియడం తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఇంట హోమాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో జగన్ రెడ్డి కోసం విశాఖ స్వరూపానంద… హైదరాబాద్ లో దాదాపుగా ఏడాది పాటు ఓ హోమం నిర్వహించారు. దీన్ని ఆయన తపస్సుగా చెప్పుకుంటారు. జగన్ కోసం తపస్సు చేశానని చెప్పుకుంటూ ఉంటారు. గతంలో ఆయన కేసీఆర్ కూడా హోమాలు నిర్వహించారు. తానే కేసీఆర్, జగన్ రెడ్డిని గెలిపించానని చెప్పుకునేవారు. అలా కోకాపేటలో రెండు ఎకరాలు రెండు రూపాయలకే పొందారు. జగన్ రెడ్డివిశాఖలో చాలా భూములు రాసిచ్చారు. ఇటీవల కేసీఆర్ కోసం చేసిన హోం ఫెయిలయింది. కేసీఆర్ ఓడిపోయారు. ఇప్పుడు జగన్ రెడ్డి కోసం పూజలు హోమం చేస్తారో లేదో స్పష్టత లేదు.
చిత్తశుద్ధి లేని శివపూజ చేసినట్లుగా.. రాజకీయ నేతల వద్ద ప్రాపకం కోసం.. పాకులాడి… వారికేదో పూజలు చేసి భూములు పొందే స్వాములు చేసే హోమాల వల్ల దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు కాని దేవుడి పేరుతో.. వారు చేసే పనులకు.. ఖచ్చితంగా పాపం అనేది అంటుకుంటుందని.. ఫలితం అనుభవిస్తారన్న సెటైర్లుకూడా వినిపిస్తూనే ఉంటాయి. ఈ విషయంలో స్వరూపానంద పేరు మొదటగా ఉంటుంది.