రాజకీయాలంటే చీప్ ట్రిక్స్ అనుకుంటారు కొంతమంది . అలాంటి వారిలో వైసీపీ సలహాదారులు ముందు ఉంటారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లిలో జనసేన పోటీ చేసింది. అదే సమయంలో జాతీయ జనసేన అనే పార్టీ కూడా ఒకటి పోటీ చేసింది. పట్టు బట్టి మరీ బక్కెట్ గుర్తును తెచ్చుకున్నారు. జనసేన పేరు గుర్తుకు తెచ్చేలా జాతీయ జనసేన అని పేరు పెట్టుకున్నారు. గ్లాస్ గుర్తుకు పోలికగా ఉండేలా బకెట్ తెచ్చుకున్నారు. ఈ కుట్రలతో దాదాపుగా ఎనిమిది వందల ఓట్లను కూకట్ పల్లిలో ఆ పార్టీ చీల్చింది.
ఇదేదో బాగుందనుకుంటున్న వైసీపీ వ్యూహకర్తలు జాతీయ జనసేన పార్టీని వెంటనే ఏపీకి తీసుకు వచ్చేశారు. ఆ పార్టీ తరపున ఏపీ అధ్యక్షుడ్ని నియమిస్తూ.. ఓ ప్రకటన చేశారు. విచిత్రం ఏమిటంటే.. పేరు, గుర్తు మాత్రమే కాదు.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడి పేరు కూడా సిమిలర్ గా ఉండేలా చూసుకున్నారు. ఎలా అంటే… కొణిదెల పవన్ కల్యాణ్‌కు దగ్గరగా ఉండేలా.. కొనింటి పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని వెదుక్కుని అధ్యక్షుడిగా ప్రకటించేశారు. ఈ ప్లాన్లు చూసి.. జనసైనికులు కూడా హవ్వ అని అనుకోక తప్పని పరిస్థితి.
జనసేన పార్టీకి .. జాతీయ జనసేన, గ్లాస్ గుర్తుకు బకెట్, కొణిదెల పవన్ కల్యాణ్ పేరుకు.. కోనింటి పవన్ కల్యాణ్ .. ఇలా చూసుకుని…. రెండు పార్టీల మధ్య గ్రామాల్లో నిరక్ష్యరాస్యులైన ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు వైసీపీ ప్లాన్ వేస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వ్యవహారం అంతా.. కుట్రల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కుట్రల్ని జనసేన ఎలా చేధిస్తుందో చూడాల్సి ఉంది.