జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై దృష్టి సారించబోతున్నారు. కాకినాడలో ఆయన బస చేయబోతున్నారు. 27న కాకినాడ చేరుకోనున్న పవన్ 28,29, 30 తేదీల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. తూ.గో జిల్లాలో జనసేనకు కాస్త ఎక్కువ స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే వాటిపై ఓ స్పష్టత వచ్చిందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలందర్నీ సమన్వయం చేసుకుని.. కూటమి విజయానికి ఏం చేయాలన్నదానిపై వ్యూహ రచన చేసే అవకాశం ఉంది.
గత అనుభవాలు, బలాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పోటీ చేస్తే.. క్లీన్ స్వీప్ చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అందుకే.. జనసేన పార్టీ చేసే స్థానాల్లో బలమైన అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు… టీడీపీ పోటీ చేసే చోట్ల నేతలంతా సమన్వయంతో… పని చేసుకుని మంచి పలితాలు సాధించేలా.. అందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. తెలుగుదేశం, జనసేన ఇప్పటికే అంతర్గత చర్చలు.. సర్వేల ద్వారా.. ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తే బాగుంటుందో ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఆయా స్థానాల విషయంలో పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
బహిరంగసభలకు వచ్చే భారీ జనాన్ని చూసి.. అన్ని ఓట్లు వస్తాయన్న ఆలోచనలు కూడా ఇప్పుడు జనసేనానికి లేవని.. పూర్తిగా రాజకీయం వేరని.. ఆ పద్దతిలోనే రాజకీయం చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. బయటకు వచ్చే వారు ఒక్క శాతం అయితే.. బయటకు రాని వారు.. 90 శాతం ఉంటారని వారందరి చేతా ఓట్లు వేయించుకోవాలంటే.. సమైక్యంగా ఉండాలని అనుకుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావాన్ని తగ్గించడానికి వైసీపీ అధినేత జగన్ చాలా ప్లాన్లు వేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం వంటి వారిని తెరపైకి తెస్తున్నారు. ఈ రాజకీయాలన్నింటినీ పవ్న ఎదురకోవాల్సి ఉంది.