సన్‌బర్న్‌ ఫెస్టివల్‌ నిర్వహించేది కేటీఆర్ బందువులా !?

హైదరాబాద్‌లో సన్‌బర్న్ ఫెస్టివల్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. అలాంటి వేడుకలకు అనుమతులు వద్దని సీఎం స్పష్టంగా చెప్పడంతో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సన్ బర్న్ నిర్వాహకులు బరితెగింపుగా వ్యవహరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా టిక్కెట్లు అమ్మకాలు ప్రారంభించారు. దీంతో బలమైన పవర్ లాబీ పని చేస్తోందని చాలా మందికి అర్థం అయింది. విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో చివరికి టిక్కెట్లు బుక్ చేస్తున్న బుక్ మై షోపై కేసులు పెట్టారు.

దాంతో టిక్కెట్ల బుకింగ్ ఆపేశారు. ఈ సన్ బర్న్ ఫెస్టివల్ ను తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాదే కేటీఆర్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లో లీజర్ ఫెస్టివల్స్ పెరగాల్సి ఉందని.. అందుకే తీసుకొచ్చామని .. హావ్ ఏ బ్లాస్ట్ అని 2014లోనే ట్వీట్ చేశారు. అప్పట్నుంచి ప్రతీ ఏడాది జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సన్ బర్న్ ఫెస్టివల్ అనేది మద్యం, డ్రగ్స్, విచ్చలవిడి పార్టీ అన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ దీనిపై వివాదాలున్నాయి. నిర్వహించేది సన్ బర్న్ సంస్థ అయినా హైదరాబాద్ లో ఫ్రాంచైజీ తీసుకుని నిర్వహించేది కేటీఆర్ బంధువులేనని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు.

కేటీఆర్ ..తన బావమరిది పేరుతో పబ్‌ల బిజినెస్ చేస్తూంటారని..ఆయన పేరు మీదనే సన్ బర్న్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున గతంలో తాము విమర్శించిన ఫెస్టివల్స్ ను ఇప్పుడు అనుమతించడం ఎందుకని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ మీద యుద్దం ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ లో ఇకపై ఇలాంటి వాటికి అనుమతి లేదంటూ చాలా స్పష్టంగా ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close