ప్రభాస్ సలార్ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో రాధరమ పాత్రలో ఆకట్టుకుంది శ్రీయారెడ్డి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో ఆమె ప్రభాస్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ అద్భుతంగా కుదిరింది. సలార్ తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర చేస్తోంది శ్రియా. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా.. శ్రియ ఎమోషన్ అయిపోతోంది. ఇలాంటి గొప్ప స్క్రిప్ట్ తన జీవితంలోనే వినలేదని, కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశానని అంటోంది శ్రియా.
”పవన్ కళ్యాణ్ ఓజీ అద్భుతమైన కథ. ఎమోషనల్ రోలర్ కోస్టర్. యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. ఈ చిత్రంలో నేను నెగటివ్ రోల్ చేయటం లేదు. సినిమాలో నాకు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రిలేషన్, పాత్ర గురించి ఇప్పుడు చెప్పను. ఓజీ తర్వాత రిటైర్డ్ అయిపోవచ్చు. అంత గొప్పగా ఉంటుంది నా పాత్ర” అని చెప్పుకొచ్చారు శ్రియా. ఈ ఎలివేషన్లు చూస్తుంటే.. ఓజీపై అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం. 2002లో విక్రమ్ సమురాయ్ వెండితెర ఎంట్రీ ఇచ్చింది శ్రియా. తెలుగులో రాజాతో ‘అప్పుడప్పుడు’ అనే సినిమా చేసింది. 2005లో ‘అమ్మ చెప్పింది’ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు. 2008 తర్వాత సినిమాల నుంచి పూర్తిగా విరామం తీసుకుంది. ఇప్పుడు సలార్ తో మళ్ళీ తెరపై సందడి చేసిన శ్రియా.. ఓజీలో కూడా ఓ కీలక పాత్రలో అలరించబోతుంది.