సీఎం జగన్ 92 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించబోతున్నారు. వీళ్లందరికీ ఎమ్మెల్యేగా ఓటు హక్కు ఉంటుంది. కానీ వీరందరికీ జగన్ రెడ్డిపై కసి తీర్చుకునే ఓ అవకాశం మాత్రం వచ్చింది. అదే రాజ్యసభ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాక ముందే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్నబలం ప్రకారం మూడు స్థానాలూ వైసీపీ ఖాతాలో పడాలి.
మూడు స్థానాల కోసం ఒక్కో స్థానం కోసం 58 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇప్పుడు సీఎం జగన్ 90 మందికి టిక్కెట్లు నిరాకరిస్తున్నారు. వారిలో 40 మంది ఇంత జరిగాక కూడా వైసీపీకి ఎందుకు ఓటేయాలని అనుకుంటే… ఓ రాజ్యసభ సీటు ఎదిగిరిపోతుంది. ఇది వైసీపీ పెద్దల్ని కలవరానికి గురి చేస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూండటంతో… విపక్ష పార్టీలతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలనాటికి ఏపీలో పోలింగ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి చెప్పినట్లుగా వినాలని ఏమీ ఉండదు. అప్పటికే మొత్తం తేలిపోతుంది. ప్రభుత్వం మారిపోతుందని నమ్మితే.. ఎమ్మెల్యేలు అంతా జగన్ రెడ్డి అభ్యర్థులకు కాకుండా.. టీడీపీ అభ్యర్థుల్ని నిలబెడితే వారికే ఓటేస్తారు. అభ్యర్థుల్ని మార్చి రెంటికి చెడ్డ రేవడి అవుతున్నామా అని వైసీపీలో ఇందు కోమే కంగారు ప్రారంభమయింది.