శర్వానంద్ – శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ‘BOB అనే వెరైటీ టైటిల్ పెట్టారు. అంటే.. అర్థం ఏమైనా ఉందా? లేదంటే ‘బాబు..’ని బాబ్ అని స్టైలీష్‌గా మార్చారా? అనేది ఆసక్తికరం. శ్రీరామ్ ఆదిత్య కాన్సెప్టులు కాస్త కొత్తగా ఉంటాయి. యాక్షన్‌ని స్టైలీష్‌గా చూపిస్తాడు. క్రైమ్ జోనర్నీ టచ్ చేస్తుంటాడు. మరి ఈ సినిమా ఏ జోనర్లో సాగుతుందన్నది చూడాలి. కథ ప్రకారం సింహ భాగం లండన్ లో తెరకెక్కనుంది. ఇండియాలో మరికొంత భాగం షూట్ చేస్తారు. శర్వా గత సినిమాలకంటే ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువగా అయ్యయే అస్కారం ఉందని తెలుస్తోంది. కథపై నమ్మకంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఈ సినిమాపై భారీగా ఖర్చు పెడుతోందట. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసి, టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ BOB కి ఎబ్రివేషన్ ఏమిటో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.