వైసీపీ అధినేత జగన్ రెడ్డి పార్టీ నేతలకు శీల పరీక్షలు పెడుతున్నారు. తనపై.. తన పార్టీపై విధేయత చూపాలనుకుంటే… చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై బూతులతో విరుచుకుపడాలని.. వారి కుటుంబాలని దూషించాలని నేరుగా చెబుతున్నారు. రాజకీయంగా చేసే విమర్శలు తనకు నచ్చవని.. వ్యక్తిగతంగా కించపరచాలని.. కుటుంబాలను తిట్టాలని అప్పుడే తాను విశ్వసనీయమైన నేతగా భావిస్తానని సంకేతాలు పంపుతున్నారు.
టిక్కెట్ డౌట్ లో పెట్టి బూతుల పోటీ
చాలా మంది నేతలకు టిక్కెట్లు ఉండవని.. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ప్రచారం చేస్తోంది. ఇలా కంగారు పడి తమ దగ్గరకు వస్తున్న వారందరికీ.. సజ్జల నుంచి వస్తున్న మొదటి సూచన ఇదే. మీ నియోజకవర్గాల్లో ప్రెస్మీట్లు పెట్టి బూతులు తిట్టాలని సూచిస్తున్నారు. చంద్రబాబు, పవన్ లపై ఎంతగా తిట్లతో విరుచుకుపడితే మీకు అంత ప్లస్ అవుతుందని చెబుతున్నారు వారిలో కొంత మంది తమకు ఇంత కంటే చాయిస్ లేదని నోరు విప్పుతున్నారు. కానీ చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు.
టిక్కెట్ ఇవ్వకపోయినా ఇతర పార్టీల్లో చేరకుండా చేసే ప్లాన్
వైసీపీ నేతలకు బూతుల పోటీలు పెట్టడం వెనుక సజ్జల మార్క్ కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టిక్కెట్లు ఇవ్వకపోయినా వారు జనసేన, టీడీపీల్లోకి వెళ్లకుండా.. ఆయా పార్టీల నేతలను వ్యక్తిగతంగా తిట్టిస్తున్నారని అంటున్నారు. పేర్ని నాని , రోజా, వల్లభనేని వంశీ, అమర్నాథ్ సహా ఎంతో మంది నేతలకు టిక్కెట్ ఇవ్వకపోయినా వారికి మరో దిక్కు లేదు. అంతగా నోరు పారేసుకున్నారు మరి. ఇలా అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు… ఎంపీలకూ అదే ప్లాన్ చేస్తున్నారు.
ప్రభుత్వం మారిదే టార్గెట్ అవుతామని సైలెంట్ గా ఉంటున్న నేతలు
రాజకీయాలను వ్యక్తిగత కక్షలుగా మార్చిన జగన్ రెడ్డి … ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలో నివాసం ఉంటారో తెలియదని కానీ.. తాము మాత్రం చచ్చినట్లుగా ఏపీలో ఉండాలని ఎక్కువ మంది వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే… ఎన్నికలకు ముందు అయినా కాస్తంత సంయమనం పాటిస్తే… బెటరని అనుకుంటున్నారు. రాజకీయంగా విమర్శలు చేస్తాం కానీ వ్యక్తిగత దూషణలు చేయలేమని ఎక్కువ మంది తప్పుకుంటున్నారు.