ఏ ప్రతిష్టాత్మక ఇండస్ట్రీ వచ్చినా గుజరాత్ బాటే పడుతుంది. టీడీపీ ఉన్నప్పుడు ఏపీకి కియా వచ్చింది కానీ.. దాన్ని కూడా గుజరాత్ తరలించుకుపోవడానికి చాలా ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఉన్నది టీడీపీ కాబట్టి సరిపోయింది.. వైసీపీ అయితే.. ప్రభుత్వమే గుజరాత్ కు పంపి ఉండేది. ఇప్పుడు టెస్లా గిగా ఫ్యాక్టరీ కూడా గుజరాత్ లో పెట్టాలని మస్క్ డిసైడయ్యారు. మోడీ సమక్షంలో అధికారికంగా ప్రకటించబోతున్నారని బిజినెస్ మీడియా ప్రకటించారు.
దేశంలో ఎన్నో రాష్ట్రాలు పారిశ్రామికంగా వెనుకబడి ఉన్నాయి. గుజరాత్ లో కన్నా ఎక్కువ సౌకర్యాలు.. ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం ఇచ్చే రాయితీల కన్నా ఎక్కువ ఇస్తామని ఆఫర్ చేసే రాష్ట్రాలు ఉన్నాయి. అయినా గుజరాత్ కే ఎందుకు పంపుతున్నారు ?. తాము అక్కడే పెడతామని టెస్లా పట్టుబట్టదు కదా… మరి ఎందుకు అక్కడికి పరశ్రమల్ని తరలించుకుపోతున్నారు.
కేంద్రం దేశంలోకి వచ్చే పరిశ్రమలు, పెట్టుబడుల ప్రతిపాదనల్ని.. అన్ని ప్రాంతాలకు సిఫారసు చేయాలి. అనువైన ప్రాంతాలను బట్టి అన్ని చోట్లా సమానంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా పెట్టుబడుల్ని రిఫర్ చేయాలి. చివరికి ఉత్తరప్రదేశ్, బీహార్ కు కూడా అన్యాయం చేస్తున్నారు. ఇక ఏపీ సంగతి చెప్పాల్సిన పని లేదు. నెత్తి మీద చేయి పెట్టుకోవడానికి సహకరించారు. కానీ గుజరాత్ కు మాత్రం వైబ్రంట్ గా మార్చేస్తున్నారు. ఇది దేశంలో అసమానతలకు దారి తీస్తోంది.