గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అంబటి రాయుడ్ని జగన్ రెడ్డి ఖరారు చేసినట్లుగా వైసీపీ లీక్ చేసింది. అయితే జగన్ రెడ్డి అంచనాలను ఆయన అందుకోలేకపోతే … చివరికి మనీ స్టామినా ఉన్న మరో లీడర్ ను జగన్ రెడ్డి తెచ్చి నిలబెడతారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకూ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఎక్కడా టిక్కెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. మనమంతా రెడ్లు అనే కాన్సెప్ట్ తో ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయారు. ఓడిపోయాక ఆయన కనిపించలేదో… ఆయనను కనిపించకుండా చేశారో కానీ.. పెద్దగా వెలుగులోకి రాలేదు.
ఇప్పుడు ఆయనకు టిక్కెట్ లేకుండా చేసి.. అంబటి రాయుడుకు చాన్సిచ్చారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి .. ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి దగ్గర బంధువు. ఆళ్ల సోదరుడు. మంగళగిరి ఎమ్మెల్యేకు టిక్కెట్ నిరాకరించారు. ఇప్పుడు మరో బంధువు మోదుగుల వెణుగోపాల్ రెడ్డికీ ఝులక్ ఇచ్చారు. మరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయోధ్యరామిరెడ్డిలోక్ సభ బరిలోకి దిగుతారా లేకపోతే కుటుంబం మొత్తం త్యాగం చేస్తుందా అని గుంటూరు రాజకీయవర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. నర్సరావుపేట ఎంపీ స్థానానికి అయోధ్య రామిరెడ్డి పేరు వినిపిస్తోంది. గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయారు.
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చినా వెంటనే టీడీపీలో చేరారు టీడీపీలో ఉండగా ఓ వెలుగు వెలిగారు. గుంటూరు ఎంపీగా… గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్ మసకబారింది.