తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తూ .. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. ఆ తీర్మారాన్ని పార్టీ హైకమాండ్ కు పంపారు. కానీ ఎలాంటి స్పందన లేదు. సోనియా పోటీ చేస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. అయితే పై నుంచి అలాంటి సూచనలు ఏవీ లేకపోతే ఇక్కడ తీర్మానం చేయాల్సిన అవసరం లేదని.. కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ప్లాన్ లో ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.
కాంగ్రెస్ అలా తీర్మానం చేయగానే సోనియా పోటీ చేయబోయే స్థానంపై విస్తృత ప్రచారం జరుగుతోంది. మెదక్ నుంచి అని.. మల్కాజిగిరి నుంచి అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. . సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎక్కువ మంది మెదక్ నుంచి పోటీ చేస్తారని అనుకుంటారు. ఎందుకంటే గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ మెదక్ లో కాంగ్రెస్ అంత బలంగా లేదు. సిద్దిపేటలో ఆ పార్టీ భారీ మెజార్టీ వస్తుంది. అది పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది.
మల్కాజిగిరి సేప్ సీటన్న విశ్లేషణ కూడా ప్రారంభమయింది. రేవంత్ రెడ్డి అక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉంటారు. అయితే కాంగ్రెస్ వ్యూహకర్తల ఆలోచన వేరుగా ఉందని ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఆ పార్టీ వర్గాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఖమ్మం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజవకర్గాల్లో భారీ మెజార్టీలతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఏడు నియోజకవర్గాలు కలుపుకుంటే లక్షల్లోనే మెజార్టీ ఉంటుంది. ముఖ్యనేతలంతా పార్టీని వీడిన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. బీజేపీ ఉనికి లేదు. అందుకే ఖమ్మం లో పోటీ చేసే అంశంపైనా ఆలోచిస్తున్నారని అంటున్నారు.