పవన్ ను టార్గెట్ చేసేందుకు బర్రెలక్క అలియాస్ శీరిషను తక్కువ చేసి మాట్లాడుతున్నవారికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రి రిలీజ్ ఫంక్షన్ లో బర్రెలక్కపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందింది. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్క పై చేసిన కామెంట్లు.. వివాదాస్పదమయ్యాయి. ఆమె తరపున లాయర్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో కేసు నమోదు చేశారు.
రామ్ గోపాల్ వర్మ ప్రీ రీలిజ్ ఫంక్షన్లో ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది, బర్రె లెక్క కాస్త ఉంటుంది, బర్రెలు లక్క ఆమె మాట కూడా వింటున్నారు, అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని పేర్కొన్నట్టు సదరు లాయర్ ఉమెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు అని లాయర్ మండిపడ్డారు. ఈ విషయం మీద మరింత పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి మాటలు వద్దు ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతాం అని ఆయన హెచ్చరించారు.
బర్రెలక్క అనే పేరుతో ఫేమస్ అయిన తెలంగాణ కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన కర్నె శిరీష మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆస్టేట్ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదన్నారు. మరో వైపు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను హైకోర్టు రద్దు చేయడంలో రిలీజ్ నిలిచిపోయింది.