ఒక్క ఏడాది ఫీజు రీఎంబర్స్ మెంట్‌ను నాలుగు ఇన్ స్టాల్మెంట్స్ లో ఇస్తానని చెప్పి.. ఏడాదికి ఒకటో రెండో వాయిదాలు ఎగ్గొడుతూ.. బటన్ నొక్కే అరకొర నిధులకు బహిరంగసభలు పెడుతున్న పవన్.. ఆ సభల్లో విపక్ష నేతలపై గుక్కెట్టి ఏడవడానికి సమయం కేటాయిస్తున్నారు. తాజాగా గత ఏడాది చివరి ఇన్స్టాల్మెంట్ ఈ ఏడాది చివరిలో విడుదల చేస్తూ.. తానేదో గొప్ప సాయం చేశానని చెప్పుకున్నారు. ఎప్పట్లాగే విపక్షాలపై ఏడ్చారు. అది భీమవరం కాబట్టి.. పవన్ కల్యాణ్‌పై కాస్త ఎక్కువగానే గుక్కెట్టారు. జగన్ రెడ్డి పాల్గొన్నది వైసీపీ బహిరంగసభ కాదు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన బహిరంగసభ. అందలో పవన్ కల్యాణ్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తారని ఆరోపించారు. ఇలాంటి వారికి అధికారం వస్తే మన ఆడబిడ్డల పరిస్థితేమిటని వాపోయారు. మ్యారేజీ స్టార్ ఆడవాళ్లను పెళ్లి వస్తువుగా చూస్తారని.. వీరంతా పెళ్లి అనే సంప్రదాయాన్ని మంటగలిపారని ముక్కు చీదుకున్నారు. ఇలాంటి వారికి ఓటేయడం ధర్మం కాదన్నారు. ఒక్కో భార్యతో మూడేళ్లు ఉండరు కానీ.. చంద్రబాబుతో పదిహేనేళ్లు ఉంటారంటున్నారని తన అక్కసు వెళ్లగక్కారు. పవన్ కల్యాణ్ ఎన్ని సీట్లు తీసుకుంటారన్నదానిపైనా జగన్ రెడ్డి ఏడవడం ఆయనలో ఉన్న అసహనానికి నిదర్శనంగాకనిపిస్తోంది. త్యాగాలు చేస్తారంటున్నారని.. ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే అంటున్నారని.. మండిపడ్డారు.
పక్క పార్టీ వ్యక్తిని సీఎంను చేయడానికి పవన్ పార్టీ పెట్టారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఏడుపులు చూసి ఎదురుగా ఉన్న వారికి కూడా బోర్ కొట్టింది. ఎ బహింగసభలో జగన్ రెడ్డి తానేదో ప్రజల్ని ఊడబొడిచానని చెప్పుకున్నారు. ఎప్పుడూ చెప్పే.. అకౌంట్లలో డబ్బుల జమ గురించి చెప్పారు. కానీ నిజంగా ప్రజల నుంచి పీడించి లాక్కున్నదే ఎక్కువని .. అప్పులు తెచ్చిన సొమ్ములన్నీ ఏమయ్యాయని వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ప్రచార సభలు .. ప్రజాధనంతో చేస్తున్నారు. అందులోనే ఒకటే క్యాసెట్ వేస్తున్నారు ఆయన సభలు పెట్టిన వారికి ఆయన ఏం మాట్లాడతారో..ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే. మూడేళ్ల నుంచి ఒకటే .. ఏడుపు తప్ప. ఆయన తాను ఏం చేస్తున్నారో చెప్పలేకపోయారు.
ఎలాగూ నీతి, నియమాలు, నైతికతఅనేది లేకుండా ప్రజాధనంతో సభలు పెట్టి రాజకీయ ప్రచారం చేసుకుంటున్నందున.. కనీసం.. ఎప్పుడూ చెప్పే సోది కాకుండా.. కొత్త్ విషయలేమైనా చెప్పే ప్రయత్నం చేయవచ్చుగా అని వైసీపీ నేతలకు వచ్చే సందేహం అసలు అక్కడ మ్యాటర్ ఉండాలి కదా అనేది.. ఎక్కువ మందికి క్లారిటీ వచ్చే అంశం.