వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే.. ..సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ రెడ్డి కేసును ముందుకు సాగనీయకుండా చేశారు. అది సీబీఐ దగ్గరకుపోయినా అదే వ్యూహం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆడాల్సిన ఆటలన్నీ ఆడారు. ఇప్పుడు తప్పుడు కేసులు, ఫిర్యాదులతో వ్యవస్థలను ఉపయోగించుకుని వైఎస్ సునీత, ఆమె భర్త, కేసును విచారించిన సీబీఐ ఎస్పీపైనా కేసులు పెట్టడమే కాకు … అఘమేఘాలపై చార్జిషీటు కూడా దాఖలు చేసేశారు. గాలి కబుర్లతో కేసులు పెట్టించడమే కాకుండా ఇరవై రెండు మంది వాంగ్మూలాలు అంటూ సాక్షులు పెట్టేసి.. చార్జిషీటు దాఖలు చేశారు.
అసలు కేసేమిటంటే.. కొంత మంది పేర్లు చెప్పాలని సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ బెదిరించారని .. అప్పటి వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలుతీసుకోలేదని దిగువ కోర్టుకు వెళ్లారు. ఆ కోర్టు ఆదేశంతో కేసు పెట్టారు. కేసు పెట్టి దర్యాప్తు చేసి వెంటనే చార్జిషీటు వేశారు., కేసులు పెట్టి అరెస్టు చేసిన కొన్ని వేల కేసుల్లో ఇప్పటి వరకూ పోలీసులు చార్జిషీటు వేయలేదు. ఓ హత్య కేసులో నిందితుల్ని కాపాడేందుకు.. న్యాయం కోసం పోరాడుతున్న వారినే జైలుకు పంపేందుకు అధికార వ్యవస్థను ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో ఇలాంటి కళ్ల ముందు కనిపిస్తూ ఉంటాయి.
గతంలోనే సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై వేరో నిందితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అప్పుడే హైకోర్టు స్టే ఇచ్చింది. తర్వాత కృష్ణారెడ్డితో ఫిర్యాదు చేయించారు. ఈ కేసులో హైకోర్టు స్టే దాకా రాక ముందే.. రోజుల వ్యవధిలోనే చార్జిషీటు దాఖలు చేశారు. ఇలాంటి విషయాల్లో వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో దీనికి ఉదాహరణ అన్న సెటైర్లు సహజంగానే వినిపిస్తున్నాయి.