మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదని ప్రకటంచారు. మంగళగిరి తన కార్యలయంలో విలేకరుల సమావేశం పెట్టి తాను షర్మిలతో కలిసి వెళ్లబోతున్నట్లుగా ప్రకటించారు. తన కార్యలయంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను తొలగించి వైఎస్, విజయమ్మ, షర్మిల ఫ్లెక్సీలను మాత్రమే ఉంచారు. ప్రస్తుతం తాను ఇకపై రాజకీయాలలో షర్మిల వెంటే తన పయనం అని స్పష్టం చేశారు.
అయితే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పుకొచ్చారు. షర్మిల ఇంకా కాంగ్రెస్ పగ్గాలు తీసుకోలేదన్నారు. తాను ఓటమి భయంతో పోలేదని, అలా అనే వారు నియోజకవర్గంలో తాను చేసిన పనుల దగ్గరకు వెళ్ళితే తెలుస్తుందని తెలిపారు. అయితే తనకు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన జగన్ ను కాదని ఇప్పుడు షర్మిల వెంట నడవటంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో షర్మిల వెంటే ఉండి తన రాజకీయ ప్రస్థానం సాగుతుందని స్పష్టంగా తేల్చి చెప్పారు.
కేవలం తన రాజీనామా అస్త్రం ప్రయోగించలేదని దానితో పాటు పార్టీ కూడా రాజీనామా చేశామని తనకు.. ముఖ్యమంత్రికి పూర్తిగా తెలుసని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుంచి తనను నిర్లక్ష్యం చేశారని తనను నమ్ముకుని పనులు చేసిన వారికి అండగా నిలబడలేక పోయానని అయితే తన సొంత నిధులు సుమారు 7 కోట్లు వచ్చిచాయని తనకోసం పనులు చేసిన వారికి బిల్లు పాస్ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. వారికి అన్ని సజావుగా చట్టప్రకారమే ఎక్కడ లంచాలకు తావులేకుండా అభివృది పనులు ముఖ్యమంత్రి నిధులు ఇవ్వకపోయినా చేశామన్నారు.