సంక్రాంతి సంబ‌రం ముందే తీసుకొస్తున్న ఎన్టీఆర్‌

ఈనెల 12 నుంచి టాలీవుడ్ లో సంక్రాంతి సంబ‌రాలు మొద‌ల‌వుతాయి. అయితే పండ‌గ ఉత్సాహాన్ని ముందే తీసుకొస్తున్నాడు ఎన్టీఆర్‌. త‌న తాజా చిత్రం ‘దేవ‌ర‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌. ఈనెల 8న ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ‘దేవ‌ర‌’ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగం షూటింగ్ 80 శాతం పూర్త‌య్యింది. గ్లింప్స్ కూడా రెడీగా ఉంది. మంచి ముహూర్తం చూసి వ‌ద‌లాల‌ని చిత్ర‌బృందం భావించింది. ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఓ కొత్త పోస్ట‌ర్‌ని కూడా వదిలారు. స‌ముద్రం హోరులో.. ప‌డ‌వ‌పై ఓ కెర‌టంలా దూసుకొస్తున్న ఎన్టీఆర్ స్టిల్‌.. ఆయ‌న అభిమానుల్ని ఆక‌ట్టుకొనేలా ఉంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ త‌ర‌వాత ఎన్టీఆర్ నుంచి వ‌స్తున్న సినిమా ఇదే. కాబ‌ట్టి అంచ‌నాలు తారా స్థాయిలో ఉన్నాయి. అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవ‌ల టీజ‌ర్‌కి ఆర్‌.ఆర్‌.కూడా పూర్తి చేశాడు. ‘గ్లింప్స్ ఓ రేంజ్‌లో ఉండ‌బోతోంది’ అంటూ అనిరుథ్ కూడా అభిమానుల‌కు ఊరించే మాట ఒక‌టి చెప్పాడు. అప్ప‌టి నుంచీ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ నిరీక్ష‌ణ‌లో ప‌డిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close