ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ రెడ్డి షివరైపోతున్నారు. గెలవడానికి ఏదో ఒకటి చేయాలని తాపత్రయ పడుతున్నారు. ఇందు కోసం ఆయన చేస్తున్న చిత్ర విచిత్ర విన్యాసాలు కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి చేస్తున్న వింతలు కూడా ఉన్నాయి. పార్టీలో ఉండి ఇంత కాలం పని చేసి.. పవన్ ను ఇష్టమొచ్చినట్లుగా తిట్టి.. తమ పరపతి చేజార్చుకున్న వారందర్నీ పక్కన పెట్టేసి కొత్త నేతల కోసం బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆయన తీరు చూసి పార్టీలోని కాపు నేతలు రగిలిపోతున్నారు.
వంగవీటి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఆఫర్
వంగవీటి రాధా మళ్లీ పార్టీలోకి రావాలని జగన్ రెడ్డి బతిమాలుతున్నారు. కొడాలి నానికి అదే టాస్క్ ఇచ్చారు. వంగవీటి ఎక్కడకు వెళ్తే అక్కడకు వెళ్లి కొడాలి నాని ఫోటోలు రిలిజ్ చేయించి… వైసీపీలోకి రాధా వస్తాడని ప్రచారం చేస్తున్నారు. కానీ గతంలో పనికి రాని .. ఉపయోగపడని వంగవీటి రాధ ఇప్పుడు ఎందుకు జగన్ రెడ్డికి అవసరం అవుతున్నారన్నదే టాపిక్. ఆయనకు విజయవాడ సెంట్రల్ తో పాటు ఆయన సోదరికి గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఎక్కడో చోట మరో టిక్కెట్ .. రెండు టిక్కెట్లు ఆఫర్ చేశారట. ఈ ఆఫర్ కు వంగవీటి టెంప్ట్ అవుతారో లేదో తెలియదు కానీ.. గతంలో ఆయన వైసీపీలో ఎదుర్కొన్న అవమానాలు.. దేవినేని అవినాష్ వైసీపీలోనే ఉండటం వంటివి గుర్తున్న వారికి వంగవీటి అలాంటి ఆఫర్లకు అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయం ఉంది.అయితే కొడాలి నాని మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ముద్రగడ కుటుంబానికీ రెండు టిక్కెట్ల ఆఫర్
ఏ పార్టీలో లేని.. పలుకుబడి కూడా లేని నేతలకు హైప్ ఎక్కించి వారిని పార్టీలోకి తీసుకునేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభంకూ బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. ఆయనకు.. ఆయన కుమారుడికి టిక్కెట్లు ఆఫర్లు చేస్తున్నారు. ఇంకా ఖర్చులు కూడా పెట్టుకోవాలని ఆయన షరతు పెట్టారు దానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా హామీ ఇచ్చారు. తర్వాత పరిస్థితి చూసి పార్టీలో చేర్చుకునేందుకు రెడీ అయ్యారు.
అంబటి రాయుడుకు ఓ ఎంపీ టిక్కెట్ రిజర్వ్
రిటైరైన క్రికెటర్ అంబటి రాయుడుకు ఓ ఎంపీ టిక్కెట్ రిజర్వ్ చేశారు. అది గుంటూరా… మరొకటా అన్నదానిపై స్పష్టత లేదు. ఆయనకు కూడా లేనిపోని హైప్ ఇచ్చేందుకు వైసీపీ మీడియా ప్రయత్నిస్తోంది. ఆయనతో వివాదాస్పద కులపరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇతర కులాలపై విద్వేషంగా మాట్లాడిస్తున్నారు. అది ఆయన పై సాధారణ జనంలో వ్యతిరేకత వచ్చేందుకు కారణం అవుతోంది. అంబటి ఇప్పుడు పొలిటికల్ ట్రాప్ లో పడిపోయారన్న చర్చ జరుగుతోంది.
పార్టీలో ఉన్న కాపు నేతలకు నిరాదరణ
పలుకుబడిలేని.. రిటైరైన …. ఇతర రంగాల్లో కాస్త డబ్బు సంపాదించిన కాపుల్ని ఆకర్షించి పార్టీలోకి తెచ్చి టిక్కెట్ ఆఫర్లు ఇస్తున్న జగన్ రెడ్డి.. సొంత పార్టీ కోసం పని చేస్తున్న వారికి మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వారంతా పనికి రాని వారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చాలా మంది టిక్కెట్లు నిరాకరిస్తామని సంకేతాలు ఇస్తున్నారు. ఇలా చేయడం జగన్ రెడ్డి కాపు వర్గాన్ని ఆకట్టుకోవడం సంగతేమో కానీ ఉన్న బేస్ పోగొట్టుకుంటారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.