ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు.. తమకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలని హఠాత్తుగా నోరు తెరవడం ప్రారంభించారు. ఇక్కడ తమకు అంటే ఉద్యోగ నేతలకు కాదు.. వారికి కావాల్సినవి వారు పొందారు.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగులకన్నమాట. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా వాడుకున్నారని.. ఇవ్వడ ంలేదని ఫీలవుతున్నారు బొప్పరాజు. హఠాత్తుగా ఆయన జనవరి ఒకటిన ప్రభుత్వంపై మళ్లీ విమర్శలు చేశారు. తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బొప్పరాజు మాటలు విని చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఉద్యోగులను అత్యంత ఘోరంగా వంచించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్ రెడ్డి సర్కారే. డీఏలు కూడా దయాదాక్షిణ్యాలన్నట్లుగా చూశారు జగన్ రెడ్డి. పీఆర్సీలో.. డీఏలు కలిపేసి.. చేసిన మోసం చూస్తే ఏ ప్రభుత్వ ఉద్యోగికయినా కడుపు మండిపోతుంది. కానీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం.. పాలాభిషేకాలు చేసుకున్నారు. ఏదో ఓ తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారన్న భయంతో వారు ఆ పనులు చేశారు. తమ భయంతో ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీశారు. ఇప్పుుడ ఎన్నికలకు ముందు మళ్లీ నోరు విప్పుతున్నారు.
కానీ ఉద్యోగ సంఘం నేతలు.. తమ స్వార్థం కోసం చేసిన పనులతో… లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టుపెట్టేశారని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడినా.. పైసా రాలదు. అంతే కాదు.. వారి పోరాటాన్ని ఎవరూ నమ్మరు.. రోడ్డెక్కినా ప్రజల నుంచి సపోర్ట్ రాదు. వారు చేసిన తప్పు ఎలాంటిదంటే.. గతంలో ఏ ప్రభుత్వమైనా ఉద్యోగుల ప్రయోజనాల విషయాన్ని పట్టించుకోకపోతే.. అడగలేనంత దీన స్థితికి ఉద్యోగ సంఘాల్ని తెచ్చారు.