ప్యాలెస్‌లో షర్మిల – ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదేం ?

షర్మిల అన్న జగన్ రెడ్డిని తన కుమారుడి పెళ్లికి పిలవడానికి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. లోపల అరగంట ఉంటే… కుటుంబంతో పావు గంట ఉన్నారని.. పెళ్లి కార్డు ఇచ్చి పిలుపులు పిలిచి వచ్చారని చెబుతున్నారు. అయితే షర్మిల కారు లోపలకు వెళ్తున్నవి.. బయటకు వస్తున్న వీడియోలు తప్ప.. ఆమె ప్యాలెస్ లో ఉండగా ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వలేదు.

నిజానికి షర్మిలతో ఎలాంటి వివాదాలు లేవని.. కుటుంబ పరంగా అందరం కలిసి ఉన్నామని చెప్పుకునేందుకు జగన్ రెడ్డి తన మార్క్ హావభావాలతో చెల్లిని ఆహ్వానిస్తారని.. తలపై చేయి పెట్టి ఎప్పట్లాగే నవ్వుతారని అనుకున్నారు. ఆ వీడియోలు బయటకు వదిలి… రెడ్డిగారి కుటుంబం అన్నట్లుగా ప్రచారం చేసుకుంటారని కూడా అనుకున్నారు. కానీ అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఎలాంటి వీడియోలు.. పోటోలు బయటకు రాలేదు.

వైసీపీ సోషల్ మీడియా నాలుగేళ్ల కిందటి నాటి ఓ సెల్ఫీ ఫోటోను వైరల్ చేస్తూ.. అది ఇప్పటిదేనని ఎప్పట్లాగే నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ సోషల్ మీడియా మాత్రం ఎగతాళి చేస్తోంది. జగన్ రెడ్డి తన చెల్లితో కనీసం ఆప్యాయంగా ఉంటానని నటించేందుకు కూడా ఆసక్తి చూపలేదని.. ఫోటోలు బయటకు రాకపోవడం బట్టి తెలిసిందని అంచనా వేస్తున్నారు. పిలుపుల తర్వాత షర్మిల మాట్లాడిన మాటలతో.. సరిగ్గా జగన్ రిసీవ్ చేసుకోలేదని.. సామాన్య జనం అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close