వైఎస్సాఆర్టీపీని గురువారం షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేశారు. షర్మిల చేరిక సందర్భంగా వేదికపై తెలంగాణ నేతలు కనిపించలేదు. ఏఐసీసీ ఆఫీసులోనే సీఎం రేవంత్ రెడ్డి సహా టీ కాంగ్రెస్ నేతలు ఉండిపోయారు. ఎవరూ వేదికపైకి రాలేదు. కాంగ్రెస్ వైఎస్సాఆర్టీపీ విలీనానికి టీపీసీసీ నేతలు దూరంగా ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వేదికపై ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు సహా సీనియర్ నేతలు మాత్రమే కనిపించారు. ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలోనే విలీనం జరిగింది.
షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. ఆమె వల్ల సమస్యలు వస్తాయని అనుకున్నారు. అందుకే విలీన ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు విలీన ప్రక్రియకు హాజరు అయితే షర్మిలకు తెలంగాణలో బాధ్యతలు ఇస్తారేమోనన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని.. అందుకే వెళ్లాల్సిన అవసరం లేదన్నట్లుగా ఆ నేతలు ఉండిపోయారని తెలుస్తోంది.
ఈ పరిణామంతో షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారని సంకేతాలు పంపినట్లయింది. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షర్మిల మద్దతు తెలిపారు. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలకూడదని బరిలో నుంచి తప్పుకున్నారు. తాను పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని షర్మిల చెబుతున్నారు. అయితే ఆమె పార్టీ విలీనంపై మాత్రం .. తెలంగాణ నేతలు ఎవరూ ఆసక్తి చూపించ లేదు.