జగన్ రెడ్డి రాష్ట్రాన్ని రాసిచ్చిన నలుగురు, ఐదుగురు రెడ్లలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు. మంచి సౌండ్ పార్టీ అయిన ఆయన… జగన రెడ్డి కుటుంబం కోసం బినామీ ఆస్తులు కూడా కొని పెట్టారని.. ప్రచారం ఉంది. అంతగా జగన్ రెడ్డితో సంబంధాలు ఉన్న ఆయన ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అయ్యారన్న ప్రచారం .. తాడేపల్లిలో సంచలనంగా మారింది. అదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ కు పంపిన తర్వాత వేమిరెడ్డిని లోక్ సభ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. అయితే ముగ్గురు అభ్యర్థుల్ని మార్చాలని ఆయన పట్టుబట్టారు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ యాదవ్ వద్దని.. అలాగే మరో రెండు నియోజకవర్గాల అభ్యర్థుల్ని మార్చాలని పట్టుబట్టారు.
కానీ జగన్ రెడ్డి… వారిని మార్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో గెలుపు కష్టమని అనుకున్న ఆయన … అప్పటికి ఓకే చెప్పి వచ్చేశారు కానీ.. ఆ తర్వాత నేరుగా వెళ్లి చంద్రబాబును కలిశారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. సమాచారం మాత్రం బయటకు వచ్చింది. ఇప్పటికే టీడీపీతో మాగుంట శ్రీనివాసులరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డితో పాటు పలువురు నేతలు టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వారంతా హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. బాలినేని పరిస్తితి గాల్లో ఉండటంతో … జగన్ రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని బట్టి వారి తదుపరి అడుగులు ఉండనున్నాయి.
వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం ఖాయమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. సీట్లు వచ్చినా రాకపోయినా… టీడీపీలో ఉండే.. కనీసం వేధింపులు అయినా లేకుండా చేసుకోవచ్చని.. జగన్ రెడ్డి పాలనలో టీడీపీ పడిన ఇబ్బందులు కళ్ల ముందు చూసిన తర్వాత… వారు అధికారంలోకి వస్తే సైలెంట్ గా ఉంటారని అనుకోలేమని భావిస్తున్నారు. జగన్ రెడ్డి, సజ్జల తీరుతో ఇప్పటికే కీలక నేతలు చాలా మంది దూరమయ్యారు. రాబోయే రోజుల్లో ఇంకెంత రచ్చగా ఉంటుందో చూడాల్సి ఉంది.