‘నా సామిరంగ’ అంటూ… ఈ సంక్రాంతి బరిలో నిలిచాడు నాగార్జున. ఇది పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమా మొదలవుతుంది. అందులో నాగ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కింగ్ కొత్త కథలు వింటున్నాడు. సుబ్బు అనే ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో నాగార్జున ఎప్పుడూ ముందే ఉంటారు. ‘నా సామిరంగ’తో బిన్ని అనే కొరియోగ్రాఫర్ ని డైరెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇప్పుడు రైటింగ్ డిపార్ట్మెంట్లో పని చేసిన సుబ్బుకి ఛాన్స్ ఇవ్వబోతున్నారు.
నిజ జీవిత సంఘటనల్ని ఆధారంగా చేసుకొని సుబ్బు ఓ కథ రాసుకొన్నాడని సమాచారం. ఇందులో హీరో ఓ లాయర్. ఈ కోర్ట్ రూమ్ డ్రామా నాగార్జునకు బాగా నచ్చిందని, ‘జై భీమ్’లా ఓ సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాతో ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేసే అవకాశం ఉంది. అందుకే.. నాగ్ ఈ కథ ఎంచుకొన్నార్ట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ బయటకు రానుంది.