పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన హైదరాబాద్ లో చంద్రబాబుతో ఇది వరకే సమావేశం అయ్యారని..రెండు,మూడు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇటీవల పెనుమలూరులో జరిగిన సామాజిక బస్సు యాత్రలో జగన్ రెడ్డి అన్యాయం చేశాడని తనను నమ్మలేదని విమర్శించారు. తర్వాత ఆయనను.. చంద్రబాబును తిట్టేలా ప్రెస్ మీట్ పెట్టాలని సజ్జల ఆదేశించారు. ప్రెస్మీట్ పెట్టారు కానీ.. చంద్రబాబును విమర్శించలేదు.. మీడియాను విమర్శించారు.
దీంతో ఆయన పార్టీ మారిపోతున్నట్లుగా తేలిపోయింది. పార్థసారధి యాదవ వర్గానికి చెందిన వారు. వైఎస్ హయాంలో మంత్రిగా చేశారు. కానీ వైసీపీలో మాత్రం ఆయనను పట్టించుకోలేదు. స్వతంత్రంగా వ్యవహరిస్తారని ప్రాధాన్యత ఇస్తే పరపతి పెంచుకుంటారన్న ఉద్దేశంతో పక్కన పెట్టారు. ఈ అసంతృప్తి చాలా కాలం నుంచి ఉంది. చివరికి ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
టీడీపీ నుంచి పెనుమలూరు అభ్యర్థిగా ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టీడీపీ టిక్కెట్ కోసం రేసులో ఉన్నప్పటికీ… బీసీ అభ్యర్థిగా పార్థసారధికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పెనుమలూరులో అతి తక్కువ మెజార్టీతోనే పార్థసారధి గెలిచారు. ఈ సారి … తీవ్రమైన వ్యతిరేక గాలులు వైసీపీపై ఉన్నందున పార్టీ మారిపోవడం కంటే బెటర్ ఆప్షన్ ఉండదని.. ఆయన డిసైడయ్యారు.