భారత రాష్ట్ర సమితిలో కొత్త జరుగుతున్న పంచాయతీని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే బయట పెట్టారు. బీజేపీతో కలిసి వెళ్లాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీజేపీలో తనకు స్నేహితుడు లాంటి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ద్వారా బీజేపీ హైకమాండ్ కు సందేశం పంపారు. వారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయం తెలిసి కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. బీజేపీతో పొత్తులు అంటే.. పార్టీని నేల నాకించడమేనని..తనకు తెలియకుండా ఇలాంటి పొత్తుల ప్రతిపాదనలు ఎదుకు చేసినట్లనని ఆయన మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్యాసదృశ్యమని కేసీఆర్ భావనని..కేటీఆర్ మాత్రం.. పొత్తు పెట్టుకోపోతే… అంత కంటే ముందే అదృశ్యం అయిపోతామని ఆవేదన చెందుతున్నారని ఆర్కే చెప్పుకొచ్చారు.
ఆర్కే చెప్పిన దాంట్లో నిజం ఉందడానికి కొన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జగన్ కేసీఆర్ ను పరామర్శించడానికి వచ్చినప్పుడు కేటీఆర్ చాలా మూడీగా ఉన్నారు. తర్వాత నుంచి ఆయన నియోజకవర్గాల సమీక్షలకు హాజరు కావడం లేదు. గొంత నొప్పి కారణం చెప్పి సైలెంట్ గా ఉండిపోతున్నారు. ప్రస్తుతానికి బీజేపీ వైపు స్పందన రాలేదు కాబట్టి కేసీఆర్ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. అయితే పొత్తులు పెట్టుకుని బీఆర్ఎస్ కు మళ్లీ జీవం పోయాల్సిన అవసరం లేదని.. ఆ పార్టీని అంతర్థానం కానిచ్చేస్తే సరిపోతుందని రాష్ట్ర బీజేపీ నేతలు హైకమాండ్ కు చెబుతున్నారని ఆర్కే చెబుతున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒకటి, రెండుసీట్లకే పరిమితమైతే.. ఆ పార్టీని నిలుపుకోవడం కష్టమన్న మాట రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. కేటీఆర్ కూడా అదే అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇది ఇప్పుడు తండ్రీ కొడుకుల మధ్యదూరానికి కారణం అవుతోందన్నది ఆర్కే వాదన. బీఆర్ఎస్ సమస్యలతో పాటు రేవంత్ రెడ్డిని ఆర్కే ఓ రేంజ్ లో పొగిడారు… చంద్రబాబుతో పాటు రాజశేఖర్ రెడ్డి కలగలిపిన పాలన, నాయకత్వం ఉందని.. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కాకుండా.. స్టేట్స్ మెన్ సీఎంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
ఏపీలోనూ బీజేపీ ఆడుతున్న గేమ్ గురించి ఆర్కే ఆసక్తికరమై విషయాలు వెల్లడించారు. పొత్తు వద్దని… టీడీపీ చెబుతోంది. గెలిచిన తరవాత ఎన్డీఏకే మద్దతిస్తామని చెబుతుననారు. బీజేపీ ఏం చేస్తుందన్నది మాత్రం క్లారిటీ లేదు. బలవంతపు బ్రాహ్మణార్థం అనే పదాన్ని ఆర్కే ఇక్కడ వాడారు కానీ… ఆయన మనసులో మాత్రం ఖచ్చితంగా వేరే ఆలోచన వచ్చి ఉంటుంది… నేను ప్రేమించాను.. మీరు ప్రేమించాల్సిందే అన్నట్లుగా బీజేపీ తీరు ఉందని ఆయన చెప్పలేకపోయారు.