దర్శకుడిగా, డాన్స్ మాస్టర్ గా కంటే లారెన్స్ ఇప్పుడు హీరోగానే బిజీ. ఇటీవల ‘జిగర్తాండ 2’ చేశారు. ఇప్పుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. మరోవైపు కొన్ని కొత్త కథలకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా మోహన్ అనే తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి అంగీకరించారు. దీనికి ‘పులి’ అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే ‘పులి’ పేరుతో చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఇది ‘లారెన్స్ పులి’ అన్నమాట.
సౌత్ సినిమాల్ని హిందీలో డబ్ చేసి, యూ ట్యూబ్ లో విడుదల చేసే నిర్మాణ సంస్థల్లో గోల్డ్ మైన్ సంస్థ అగ్రగామి. ఆ సంస్థే ఇప్పుడు లారెన్స్ తో ఈ సినిమా ప్లాన్ చేసింది. ఇందులో హీరో జూలో పని చేస్తాడట. అందుకే ‘పులి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కథానాయికగా ప్రియ భవానీ శంకర్ని ఎంచుకొన్నారని తెలుస్తోంది. లారెన్స్ సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతాయి కాబట్టి, టాలీవుడ్ కి చెందిన ఒకరిద్దరు ప్రముఖ నటులు ఈ ప్రాజెక్టులో మెరిసే అవకాశాలు ఉన్నాయి.