ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి సరికొత్త ప్రజాస్వామ్య తీర్పును రాయాలని అనుకుంటున్నారు. తనకు అనుకూలంగా ఉన్న ఓటర్లను.. దొంగ ఓటర్లను చేర్చి.. ఓటర్ల జాబితాను రెడీ చేసుకుని వాటితోనే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. వైసీపీ నేతలు నేరుగా అధికారులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని టీడీపీ ఓటర్లు అని భావించిన వారందరి ఓట్లను పీకేస్తున్న వైనం కొన్నాళ్లుగా కళ్ల ముందు ఉన్నా.. తూ తూ మంత్రం చర్యలు తీసుకుటున్నారు .. కానీ ఇలాంటి అక్రమాలపై విరుచుకుపడతామని.. ఓటర్ల జాబితాను ట్యాంపర్ చేస్తే దేశద్రోహమేనని గట్టి హెచ్చరికలు పంపడం లేదు.
ఇప్పటికీ పెద్ద ఎత్తున అక్రమాలు ఉన్నాయి. స్థానిక రాజకీయ నేతలు విశ్లేషించి ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో ఎన్నికల తేదీలు ముంచుకొస్తున్నాయి. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు , సమీక్షించేందుకు సీఈసీ రాజీవ్ కుమార్ అమరావతి వస్తున్నారు. ఆయనను పలు రాజకీయపార్టీల ప్రతినిధులు కూడా కలవనున్నారు. గతంలో ఢిల్లీలోనే ఫిర్యాదులు చేయాలనుకున్న చంద్రబాబు ఆగిపోయారు.. ఇప్పుడు విజయవాడలో కలిసి పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఏ ప్రజాస్వామ్యానికి అయినా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లే ప్రాణం. ఓటర్ల జాబితాలో ఒక్క శాతం పొరపాట్లు ఉన్నా అది తీవ్రమైన అంశం. క్రిమినల్స్ ప్రభుత్వాధినేతగా ఉన్న చోట్ల అరాచకాలకు హద్దే ఉండదు. ఇలాంటి చోట్ల ఈసీప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని సీఈసీ రాజీవ్ కుమార్ గుర్తిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.