నిజామాబాద్ నుంచి బరిలోకి దిగేందుకు కవిత సిద్దంగా లేరు. తాను అక్కడ్నుంచే పోటీ చేస్తానని గతంలో ఎంపీ అర్వింద్ తో సవాళ్లకు సైతం దిగిన కవిత ఇప్పుడు పోటీ విషయంలో వెనుకడుగు వేశారు. తెలంగాణ భవన్ లో నిజామాబాద్ పార్లమెంట్ సమీక్ష జరిగింది. కవిత హాజరయ్యారు. కానీ అభ్యర్థిగా కవిత పోటీ చేస్తారని మాత్రం అటు కేటీఆర్ కానీ.. ఇటు కవిత కానీ ప్రకటించుకోలేదు.
దీంతో నిజామాబాద్ నుంచి కొత్త అభ్యర్థిని రంంగంలోకి దించుతారన్న ప్రచారం జరిగింది. కవిత కూడా నిజామాబాద్ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మంది నేతలు కార్యకర్తలను కూడా కలవనీయలేదన్నారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారని కవిత వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ పనితీరుపై నేతలు అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని తాజా పలువురు మాజీ ఎమ్మెల్యేల పై పరోక్షంగా కామెంట్స్ చేశారు కవిత. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో ఓడిపోయాము అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. నిజామబాద్ నియోజకవర్గం నంచి కవిత ఓ సారి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మళ్లీ నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచే బరిలోకి దిగేందుకు ఆమె సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల బాధ్యతనూ తీసుకున్నారు. అయితే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అక్కడ బీఆర్ఎస్కు ఎదురుగాలి వీచినట్లయింది. అందుకే కవిత పోటీ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కవిత పోటీ చేయకపోతే..బీఆర్ఎస్ సెంటిమెంట్ మరింత దెబ్బతినే అవకాశం ఉంది.