ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న 4 సినిమాల్లో హైప్ పరంగా, క్రేజ్ పరంగా అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా `గుంటూరు కారం`. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు దిల్ రాజు తన స్పీచ్ తో.. వాటిని డబుల్ ట్రిపుల్ చేసేశాడు. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు తన స్పీచ్తో మహేష్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించాడు. ‘గుంటూరు కారం’లో మహేష్ ఎనర్జీ మామూలుగా లేదని, ఓ పాటలో దుమ్ము దులిపాడని, స్క్రీన్లు చిరిగిపోవడం ఖాయమని, పేపర్లు సరిపోవవని.. ఈ సినిమా చూస్తుంటే పోకిరి, దూకుడులో మహేష్ క్యారెక్టరైజేషన్ గుర్తొచ్చిందని, సినిమా సూపర్ హిట్ కావడం గ్యారెంటీ అని జోస్యం చెప్పాడు.
ఈ సినిమాని దిల్ రాజు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కొన్ని సీన్లు, పాటలూ చూశారట. అవన్నీ మామూలుగా లేవని చెబుతూ అభిమానులకు మరింత బూస్టప్ ఇచ్చాడు. శ్రీలీల డాన్సులకు కూడా దిల్ రాజు నుంచి కితాబులు అందాయి. కుర్చీ మడతపెట్టి పాటలో మహేష్ డాన్సులు గురించి ఫ్యాన్స్ ప్రత్యేకంగా చెప్పుకొనేలా డిజైన్ చేశారు. ఈరోజు ‘గుంటూరు కారం’ నుంచి కొత్త పాట వచ్చింది. ఆ పాటలోనూ మహేష్ డాన్సులు బాగానే ఉన్నాయి. చాలా కాలం నుంచి డాన్సుల విషయంలో మహేష్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్న మాట నిజం. ఆ లోటు ఈ సినిమాతో తీరిపోయినట్టే కనిపిస్తోంది.