జగన్ రెడ్డి జనంలోకి వెళ్లడం లేదు. ఎన్నికలు ముంచుకు వచ్చినా డబ్బులు పడని బటన్లు నొక్కేందుకు ఎప్పుడో ఓ సారి వెళ్లి చంద్రబాబు, పవన్ పై బూతులు తిట్టి తమ అహాన్ని చల్లార్చుకుని వస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ రాజకీయ పర్యటనల జోలికి పోలేదు.ఇక ఎన్నికల ప్రచారసభలకు మాత్రమే.. ఆయన వెళ్లే అవకాశం ఉంది. అత్యధిక కాలం క్వారంటైన్ లో ఉన్న సీఎంగా ఆయన పేరు రికార్డుల్లోకి ఎక్కుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఓ ప్రజా దర్బార్ లేదు.. జిల్లాల పర్యటనలు లేవు.. ఈ వ్యవహారంపై వైసీపీలోనే అసంతృప్తి ఉంది. దీన్ని కవర్ చేసుకోవడానికి పేటీఎం కూలీలు బయలుదేరారు.
జగన్ రెడ్డి జనంలోకి వెళ్లకపోవడం వ్యూహమా అంటూ… కొత్త అర్థాలతో ప్రచారం ప్రారంభించారు. దీన్ని చూసిన వైసీపీ నేతలకు …. ఆ పార్టీ సానుభూతి పరులకు వింతగా అనిపిస్తోంది. సీఎం జనంలోకి రాకపోవడం వ్యూహం అయితే.. రేపు ఓడిపోవడం కూడా వ్యూహమే అవుతుందన్న సెటైర్లు అవినిపిస్తోంది. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి.. అప్పుల పాలు చేసినందున.. ఇక పిండుకోవడానికి ఏమీ లేదని తెలిసే జగన్ రెడ్డి ఓడిపోయారని.. ఇప్పుడు అసలు టార్చర్ గెలిచిన చంద్రబాబుకే ఉంటుందని .. ఏప్రిల్ తర్వాత రాతలు రాసినా ఆశ్చర్యం లేదు.
జగన్ రెడ్డి చేతకాని తనాన్ని కవర్ చేయడానికి పేటీఎం బ్యాచ్లు… సజ్జల కుమారుడి అతి తెలివి తేటలతో నడుస్తున్న సోషల్ మీడియా విభాగం అనేక ప్రయత్నాలు చేస్తుంది.,అవన్నీ రివర్స్ అయి నవ్వుల పాలవుతున్నాయి. కలిసి వచ్చినంత కాలమే… తప్పు చేసినా నడుస్తుంది.. బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయితే… అసలు కథ కనిపిస్తుంది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇదే.