ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కోవర్టులనే పేరు మారుమోగిపోతోంది. ఓ పార్టీకి అత్యంత విధేయం అనుకున్న వారు కూడా గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. వారు కోవర్టులేమో అన్న అనుమానం చాలా మందికి వస్తోంది. కానీ పార్టీలోకి వస్తున్నారు వారి వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి సర్దుకుపోతున్నారు. టీడీపీలోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రావడాన్ని చాలా మంది నమ్మలేకపోయారు. కానీ టీడీపీలోకి వచ్చాక ఆయన తీరు చూస్తే… బాగా గాయపడి వచ్చాడని స్థిర అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇంకా చాలా జంపింగ్స్ జరుగుతున్నాయి. వైసీపీ నుంచి ఆశ్చర్యకరమైన ముఖాలు టీడీపీలోకి వస్తున్నాయి. వారి వల్ల ఉపయోగం ఉంటుందని అనుకుంటే టీడీపీ ఆహ్వానిస్తోంది.
అదే సమయంలో టీడీపీ టిక్కెట్ లేదని చెప్పిన కేశినేని నాని వైసీపీలో చేరిపోయారు. ఆయన ప్రజారాజ్యంలో టీడీపీ కోవర్టుగా పని చేశారన్న ఆరోపణలు గతంలో ఉన్నాయి. కానీ ఆయన వ్యవహారశైలి చూస్తే.. ఏ పార్టీలో ఉన్నా అందరికీ కోవర్టుగానే కనిపిస్తారని చెప్పక తప్పదు. ఇప్పుడు టీడీపీలోకి వెల్లువలాగా ఎమ్మెల్యేలు రానున్నారు. టిక్కెట్లు ఖరారు చేసిన వారు కూడా రావడానికి ఆసక్తి చూపడం ఇక్కడ విశేషం.
కోవర్టులుగా వచ్చినా పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కరు కూడా దారి తప్పే అవకాశం లేదు. కానీ.. ఈ లోపు మపార్టీ నుంచి కీలక సమాచారం ఏమైనా త నపార్టీకి పంపుతారేమోన్నన సందేహాలు పార్టీ నేతలకు ఉన్నాయి. ఫిరాయింపుల ద్వారా వచ్చే వారికి పెద్దగా అవకాశం కల్పించాలని టీడీపీ, జనసేన అనుకోవడం లేదు. తప్పనిసరిగా గెలుస్తారనుకుంటే మాత్రమే .. సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీలో చేరేందుకు చాలా మంది ఉన్నా… వైసీపీలో చేరే వారు కనిపించడం లేదు. టిడీపీ టిక్కెట్లు ప్రకటించిన తర్వాత కూడా చేరుతారన్న గ్యారంటీలేదు. వైసీపీ గెలుస్తుందన్న సెంటిమెంట్ కానీ నమ్మకం కానీ నాలుగైదు శాతం కూడా లేకపోవడంతో.. ఏదో ఒకటి టీడీపీలో ఉందామనుకునేవారే ఎక్కువ.