చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా ఖరారైన విజయానందరెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూస్తే… ఏపీ ప్రజలకు మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. కారు డ్రైవర్ గా ఆయన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ఎర్ర చందనం స్మగ్లర్ గా వందల కోట్లు సంపాదించారు. వైసీపీకి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసే స్మ్గగ్లర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. గతం నుంచి వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన.. జగన్ రెడ్డి మొప్పు పొందారు. జగన్ రెడ్డి గెలవగానే ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు బలిజ నేతను పక్కన పెట్టి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తున్నారు.
విజయానందరెడ్డిపై పదుల సంఖ్యలో ఎర్రచందనం కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు ఉన్నాయి. 2014లో ఆయనపై పీడీ చట్టం కూడా ప్రయోగించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో వ్యాపార భాగస్వామి పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఆయన బాగోగులు చూసుకున్నారు. రాజమండ్రి జైలుు వెళ్లి మరీ పరామర్శించారు. జగన్ రెడ్డి కూడా ఓ సారి విజయానందరెడ్డి ఇంటికి వెళ్లి ఆతిధ్యం స్వీకరించారు.
క్రిమినల్స్ కు వైసీపీలో పెద్ద పీట వేస్తారు. చివరికి కార్పొరేటర్ సీట్లను ఇచ్చేటప్పుడు కూడా పిక్ పాకెటర్స్ కు ప్రాధాన్యత ఇస్తారు. విజయవాడ కార్పొరేటర్లలో పిక్ పాకెట్ కేసులు ఉన్న వాళ్లు ఉన్నారు. కార్పొరేటర్లు అయిన తర్వాత కూడా అదే పని చేస్తూ దొరికిపోయారు. వైసీపీలో ఏ స్థాయిలో నూ దోపిడీు, దొంగతనాలు, మర్డర్లు, స్మగ్లింగ్ చేసిన వాళ్లకే ప్రాధాన్యత లభిస్తోంది. ఓట్లేసే ప్రజలే విజ్ఞతతో ఆలోచించుకోవాల్సి ఉంది. లేకపోతే…. ఏం జరుగుతుందో అంచనా వేయడం కూడా కష్టమే.