ఎస్పీ స్థాయి అధికారి తల్లిని అడ్డగోలుగా దూషించాడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,. అదే ఎస్పీని ఆయన మూడు రోజుల కిందట కలిసి తన ఫోన్ హ్యాక్ అయిందని చర్యలు తీసుకోవాలని కోరాడు. తన అనుచరులు నిబంధనలకు విరుద్దంగా మద్యం బాటిళ్లు తీసుకెళ్తుంటే పట్టుకున్నారని సెబ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐ కుర్చీలో కూర్చుని వారిపై దౌర్జన్యం చేశాడు. ఎస్పీని తిట్టాడు. అదంతా వీడియో సహితంగా ఉంది.
కానీ ఒక్క పోలీసు సంఘం నోరెత్తలేదు. ప్రతిపక్ష నేతలపై తొడలు కొట్టిన పోలీసులు చాలా మంది ఉన్నారు. తప్పుడు పనులు చేసే పోలీసులపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తే.. వెంటనే పోలీసు అధికారుల సంఘం తెరపైకి వచ్చేది. ఇప్పుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై కనీసం కేసు కూడా పెట్టలేకపోయారు. వ్యవస్థను ఓ క్రిమినల్ అవసరాలకు తగ్గట్లుగా మార్చేస్తే…. ఇప్పుడు వారి అరాచకాలకు పోలీసులు కూడా బలి కావాల్సి వస్తోంది.
పోలీసుల్లోనూ నేర ప్రవృత్తి ఉన్న వారినే ప్రోత్సహిస్తున్నారు. వారికే కీలక పోస్టింగులు ఇస్తున్నారు. బాగా మెచ్చిన వారికి టిక్కెట్లు కూడా ఇస్తున్నారు. కానీ వ్యవస్థ మాత్రం కుళ్లిపోతోంది. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన వారు.. . తమ స్టేషన్ కు వచ్చి తమ కుర్చిలో కూర్చుకుని రాజకీయ నేతలు బండ బూతులు తిడుతుంటూ వినయంగా చేతులు కట్టుకుని వింటున్నారు. వారా ప్రజలకు భరోసా ఇచ్చేది ?