వైసీపీలో టిక్కెట్లు పొందాలంటే… టీడీపీ నేతలు ఏం చేయాలో పర్ఫార్మెన్స్ షీట్ రెడీ అయింది. ముందుగా టిక్కెట్ ఆఫర్ లేదు కానీ.. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని సంకేతాలు పంపుతున్నారు. వారి ఆశల్ని వాడుకుంటూ… సోషల్ మీడియాలో ప్రచారానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. పార్టీలో చేరిన కేశినేని నానిని, ఆయన కుమార్తెతో తమదైన మార్క్ ప్రచారం చేయిస్తున్నారు. వారు ఇలాంటి వాళ్లా అని జనం కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. తాజాగా రాయపాటి రంగారావు అనే ఆయన చంద్రబాబు ఫోటోను విసిరికొట్టే సీన్ చేశారు. దాన్ని మూడు నాలుగు కెమెరాలతో షూట్ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
ఎవరీ రాయపాటి రంగారావు అంటే.. రాయపాటి సాంబశివరావు తనయుడు. సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వలేదని ఆయన గోల. ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్లిన బాపతా అంటే కాదు. ఎప్పుడైనా సీరియస్గా రాజకీయాలు చేసిన వ్యక్తా అంటే కాదు.. కానీ ఆయన గోల ఆయనది. వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ తో చంద్రబాబు ఫోటో నేలకేసి కొట్టారు. రేపో మాపో జగన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరొచ్చు. ఎందుకంటే వైసీపీలో ఇలాంటి పర్ఫార్మెన్స్కు పెద్ద పీట వేస్తారు. జగన్ రెడ్డి దాన్ని మెచ్చితే టిక్కెట్ ఇచ్చినా ఇస్తారు.
రాయపాటి పూర్తిగా ఫేడవుట్ అయిపోయారు. అనారోగ్యంతో ఆయన మంచం పట్టారు. అమరావతి ఉద్యమంలో రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమార్తె రాయపాటి శైలజ యాక్టివ్ గా పాల్గొన్నారు. ఒక వేళ ఏదైనా అవకాశం ఉంటే ఆమె పేరు పరిశీలిస్తారు కానీ.. రంగారావు పేరు పరిశీలనకు వచ్చే చాన్స్ లేదు. అయినా అయినా ఎన్నికలకు ముందు… ఐదేళ్ల పాటు సైలెంట్ గా ఉన్న నేతలు ఇలాంటి పర్ ఫార్మెన్స్ తో తెరపైకి వస్తున్నారు. ఇలా చేసినందుకైనా వైసీపీలో వీరికి టిక్కెట్లు దొరికిదే.. వారంతా చంద్రబాబుకు ధ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.