ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఏది చేయాలంటే అది చేయవచ్చని అనుకుంటారు. కానీ అలాంటి అవకాశం లేదు. రాజ్యాంగబద్దంగా పాలన చేయాలి. ఇటీవల ప్రభుత్వాలు తమదైన భాష్యాన్ని రాజ్యాంగానికి చెప్పుకున ిపాలన చేస్తున్నాయి. అయితే ఈ పాలకులకు భిన్నంగా రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. దానికి తాజా ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నియామకం కోసం చేస్తున్న ప్రక్రియ.
గతంలో ఎప్పుడూ లేని విధంగా టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మెన్, సభ్యుల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. . టీఎస్పీఎస్సీ చైర్మెన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఆ వెబ్సైట్లో పొందుపరిచింది. అర్హులైన వారు ఈనెల 18వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు నిర్ణీత దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించాలని కోరింది స్వీకరించిన దరఖాస్తుల నుంచి లేదా ఇతరత్రాగానీ, ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ/స్క్రీనింగ్ కమిటీ ద్వారా చేస్తారు.
టీఎస్పీఎస్సీ చైర్మెన్ పదవికి డాక్టర్ బి జనార్ధన్‌రెడ్డి , మరో ముగ్గురు సభ్యులు గతనెల 11న రాజీనామా చేశారు. గవర్నర్ ఈనెల 10న ఆమోదించారు. టీఎస్పీఎస్సీ చైర్మెన్, సహా పది మంది సభ్యుల నియామకానికి అవకాశమున్నది. టీఎస్పీఎస్సీ చైర్మెన్ సహా సభ్యుల నియామక ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీకి వెళ్లినపుడు యూపీఎస్సీ చైర్మెన్‌తో ఆయన భేటీ అయ్యారు. చైర్మెన్, సభ్యుల నియామకంతోపాటు ఉద్యోగాల భర్తీకి సంబంధించి న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకోవైపు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, మాజీ కార్యదర్శి వాణీ ప్రసాద్ బృందాలు కేరళ, యూపీఎ స్సీని సందర్శించి పలు వివరాలను సేకరించాయి.
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి… లీకులతో కాకుండా… నిరుద్యోగులకు భరోసా కల్పించేలా చేయాలనుకుంటున్నారు. దాన్నిపద్దతిగా చేస్తున్నారు.