స్కిల్ డెలవప్మెంట్ కేసులో తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని తనకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. గతంలో విచారణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టింది. మొదట ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినప్పటికీ అర్థరాత్రి అరెస్టు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేశారు. తర్వాత మరో నాలుగు కేసులు పెట్టారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించింది. ఆ కేసులోనూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరో మూడు కేసుల్లో చంద్రబాబుకు ఇటీవలే ముందస్తు బెయిల్ వచ్చింది. స్కిల్ కేసులో ఇప్పటికే పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ తీర్పులో న్యాయమూర్తి చిన్న ఆధారం కూడా సీఐడీ చూపించలేదని తెలిపింది.
క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే.. ఆయన పై పెట్టి నకేసులన్నీ అక్రమం అని తేలుతాయి. కోర్టుల్లో ఉన్నవన్నీ తేలిపోతాయి. అయనను అక్రమంగా అరెస్టు చేసినట్లుగా తేలిపోతుంది. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. చంద్రబాబును అరెస్టు చేయాలనుకుంటే కొత్త కేసులు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వం గాల్లో కేసులు పుట్టించి కావాలనుకున్న వారిని అరెస్టు చేసేస్తోంది. చంద్రబాబును ఎన్నికల ప్రక్రియకు దూరం చేయాలన్న కుట్రతోనే కేసులు పెట్టారని ఇప్పటికీ స్పష్టమయింది.