టీడీపీ, జనసేన పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు రాకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. సీట్ల కేటాయింపు అయినా మేనిఫెస్టో అంశాలు అయినా.. పార్టీ నేతల చేరికల గురించి అయినా ఇరువురే డైరక్ట్ గా డీల్ చేస్తున్నారు. మధ్యలో ఇతర నేతలు ఉంటే.. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి రానీయకూడదని ఇద్దరూ పట్టుదలగా ఉన్నారు. ఆ ప్రకారమే ఇటీవలి కాలంలో తరచూ సమావేశాలు జరుగుతున్నాయి.
డిన్నర్ మీట్లో ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఓ స్పష్టతకు వచ్చిటన్లుగా తెలుస్తోంది. మూడున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో ఈగోలకు పోయి పోటీలు చేయకుండా ఎవరు పోటీ చేస్తే గెలుస్తారో వారే పోటీ చేయాలన్న అంచనాలకు వచ్చారు. జనసేన పార్టీ తరపున తాము చేయించుకున్న సర్వేలు,అంచనాలతో పవన్ కల్యామ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ స్థానాలపై సుదీర్ఘమైన కసరత్తు జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానించాలని బాబు, పవన్ నిర్ణయం తీసుకున్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో వ్యతిరేకత , అవకాశవాదం కోసం వచ్చే నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు.
కూటమి తొలి జాబితా సిద్ధం చేసిన అనంతరం ఉమ్మడిగా కలిసి జాబితాను విడుదల చేయాలని బాబు, పవన్ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగసభలో మేనిఫెస్టో ప్రకటించనున్నారు. టీడీపీవి ఆరు, జనసేనవి ఆరు హామీలు కలిపి మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంది. ప్రతీ చేతికి పని..ప్రతి చేనుకకు నీరు అనే కాన్సెప్ట్ తో ప్రజల ముందుకు వెళ్లనున్నారు.
నేరుగా చంద్రబాబు, పవన్ చర్చించి నిర్ణయం తీసుకుంటూండటంతో సీనియర్ నేతలుకూడా జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. వారు తీసుకునే నిర్ణయాలే ఫైల్. ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చన్న సంకేతాలను ముందుగానే ఇస్తున్నారు.