లోహ్రీ, ఓనం, సంక్రాంతి పేరు ఏదైనా రైతుల ఇంటికి ధాన్యం వచ్చే సందర్భాన్ని పండుగగా సంబరాలు చేసుకుంటారు. మారుతున్న జీవన శైలితో పండుగలు అంటే కూడా అర్థం మారిపోతూ వస్తుంది. పండుగలు చేసుకునే శైలి మారిపోతోంది. కానీ ఆ ఆనందాల్లో మాత్రం మార్పు ఉండదు తెలుగు వారికి అతిపెద్ద పండగ సంక్రాంతి. ఏ పండుగను కుటుంబసభ్యులందరితో చేసుకోకోయినా సంక్రాంతిని మాత్రం కలిసి జరుపుకోవాలనుకుంటారు.
ఇక్కడ కుటుంబం అంటే విస్తృతార్థం ఉంటుంది. తల్లీ, తండ్రీ, అక్కా, తమ్ముడు వంటి బంధువులే కాదు పుట్టిన ఊరు నిండా ఉండే మిత్రులు,పరిచితులు అందరూ కుటుంబసభ్యులే. వారితో కలిసి గడపడం … జ్ఞాపకాల్లోకి వెళ్లడం కూడా సంక్రాంతి పండగ స్పెషలే. ఈ ఏడాది సంక్రాంతి మరికొంత స్పషల్. ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. అది ఇష్టమో.. కష్టమో.. నష్టమో అంచనా వేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఈ ఏడాది సగం మందికిపైగా రైతులు వ్యవసాయానికి దూరంగా ఉన్నారు.
అయితే పండగ అనందానికి ఈ తాత్కలిక కష్టమేనీ అపవు. జీవితంలో ఇలాంటివన్నీ భాగం. ఈ రోజు కన్నా రేపు హ్యాపీగా ఉండటమే పండుగ. అలాంటి ఆశాభావంతో మనం ముందుకు వెళ్లాలి. రాబోయే రోజులు మరింత గొప్పగా ఉంటాయని.. అందరి జీవితాల్లో ఉషస్సులు నింపుతాయని ఆశిద్దాం.
తెలుగు 360 పాఠకులు అందరికీ హ్యాపీ సంక్రాంతి.