నెల రోజుల కిందట ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు. అంటే ఆ పెట్టుబడుల సదస్సును ఎంత కీలకంగా భావించారో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రత్యేకంగా ప్రతీ రాష్ట్రం ఓ స్టాల్ ఏర్పాటు చేస్తుంది. ఆ పెవిలియన్ ద్వారా తమ రాష్ట్రంలోని అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు తెలియచేస్తారు. అప్పటికప్పుడు పెట్టుబడులు వచ్చినా రాకపోయినా .. ఇన్వెస్టర్లకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న అవకాశాల గురించి ఓ స్పష్టత వస్తుంది. భవిష్యత్ లో ఎప్పుడైనా తమ అవసరాలకు ఏపీ సరిపోతుందనుకుంటే వస్తారు.
చంద్రబాబు హయాంలో ప్రతీ ఏడాది దావోస్‌కు ప్రతీ ఏడాది వెళ్లేవారు. పెద్ద బృందంతో ప్రత్యేకంగా పెవిలియన్ కూడా ఏర్పాటు చేసేవారు. ఆ పెవిలయన్ కు ప్రపంచంలోని టాప్ ఇన్వెస్టర్లను ఆహ్వానించేవారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తన ఐదేళ్ల పదవి కాలంలో ఒక్క సారి దావోస్ వెళ్లారు. అదీ కూడా కేవలం విహారయాత్రకు వెళ్తూ మధ్యలో మూడు రోజులు అక్కడ ఉన్నారు. అక్కడ చేసుకున్న పెట్టుబడుల ప్రతిపాదనలు అన్నీ పాతవి. బినామీలుగా ఆరోపణలు ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబానికి చెందిన అరబిందో, షిరిడిసాయి, గ్రీన్ కో ఇలాంటి కంపెనీలతో ఒప్పందాలు. గతంలో చేసుకున్న ఒప్పందాలనే మళ్లీ చేసుకున్నట్లుగా చూపించారు. వాటినే మళ్లీ విశాఖ పెట్టుబడుల సమ్మిట్ లో చేసుకున్నారు.
అంటే పెట్టుబడుల సదస్సును ఆయన కామెడీ చేశారు. అమరావతిని రద్దు చేయడం.. పీపీఏలను రద్దు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఏపీపై ఇన్వెస్టర్ల నమ్మకం మొదట్లోనే సడలిపోయింది. ఏపీని నేరుగా కామెడీ చేశారు. సీఎం జగన్ తీరు వివాదాస్పదమయింది. ఏ మాత్రం తెలివి, అవగాహన లేని ఈగోయిస్టు సీఎంగా ఇన్వెస్టర్లలో ముద్రపడిపోయింది. లూలూ లాంటి మెగా ఇన్వెస్టర్లు ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని నేరుగా ప్రకటించిన దౌర్భాగ్యం వచ్చి పడింది. అందుకే ఏపీకి అన్నీ గాలి పెట్టుబడులు వస్తున్నాయి కానీ నికరంగా ఒక్క ఉపాధి చూపించే పరిశ్రమ రాలేదు. కానీ ప్రకటనలు చేయమంటే కోట్ల ప్రకటనలు చేసి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏపీలో ఉన్న పరిశ్రమలన్నీ తాము తెచ్చినవేనని చెప్పుకుంటారు.