ఎవరైనా పండగ వస్తే గుడికి వెళ్తారు.. కానీ ఇంటి దగ్గరే గుడి సెట్టింగ్ వేసుకుని సంబరాలు జరుపుకునే వారికే ఓ రేంజ్ ఉంటుందని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. అయితే తన బిల్డప్ కోసం సొంత డబ్బులతో సెట్టింగ్ వేసుకునే వారికి .. ప్రజాధనంతో సెట్టింగ్ లు వేసుకుని ఫోటోలు వీడియోలు తీసుకునే వారికి ఉండే రేంజ్ వేరని ఆయన అర్థం చేసుకోవడం లేదు. తాజాగా సంక్రాంతి సంబరాల కోసం తాడేపల్లిలో జరిగిన ఏర్పాట్లు చూస్తే అందరూ బిత్తరపోవడం ఖాయం. సీఎం దంపతుల్ని రంజింప చేయడానికి తిరుమల తరహాలో వేసిన సెట్టింగ్ కాకుండా ఆయనకు వినోదం అందించడానికి ప్రత్యేక కళాకారుల్ని ఏర్పాటు చేశారు.
జగన్ రెడ్డికి వినోదం అంటే చంద్రబాబును తిట్టడమే. ఆ కళాకారులు సంక్రాంతి సంబరాల్లో ఉన్నామని గుర్తుంచుకోకుండా జగన్ రెడ్డికి ఏది నచ్చుతుందో అదే చెప్పాలి కాబట్టి చంద్రబాబును తిట్టేలా సంక్రాంతి పాటలు పాడుకున్నారు. వారి తీరు చూసి పండగ సంబరాలు అని వచ్చిన వారికి మైండ్ బ్లాంక్ అయింది. రాజకీయం చేయడానికి పండగలు..పబ్బాలు ఏమీ ఉండవు.
ప్రతీ దానికి చంద్రబాబు మీద పడి ఏడవటం.. దేవుడి కోసం చేసిన ఏర్పాట్లలోనూ అదే ఉండటం… ఘోరమైన మానసిక స్థితికి అద్దం పడుతోంది. ఇవన్నీ సొంత డబ్బులతో చేసుకుంటే ఎవరూ అడిగేవారు కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి ఓ మాదిరిగా కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మాత్రం ప్రజల ఖర్చుతో పండగలు చేసుకుంటూ ప్రతిపక్ష నేతల్ని తిట్టిస్తూ వింటూ ఆనందపడుతున్నారు.