చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ను ప్రకటించారు. ముందునుంచి ప్రచారంలో వున్న ‘విశ్వంభర’ పేరునే ఖరారు చేశారు. ఈ పదానికి భూమి, విశ్వమును పాలించేవాడు, దిక్కులు అంబరంగా కలిగిన వాడు, శ్రీ మహావిష్ణువు.. ఇలా కొన్ని విశేషమైన అర్థాలున్నాయి. కాన్సెప్ట్ వీడియో చాలా ఆసక్తికరంగా వుంది. ఇది మూడు లోకాల చుట్టూ తిరిగే కథని వినిపించింది. కాన్సెప్ట్ పోస్టర్ లో అది కనిపించింది. వైకుంఠంలో ఒక రుద్రాక్ష కారంలోనే పెట్టెను మూత పెట్టడం, అది ఆకాశం నుంచి కిందకు రావడం, మధ్యలో విస్పోటనం జరగడం, అక్కడి నుంచి భూమిపైకి చేరూకోవడం, భూలోకంలో హనుమంతుని పెద్ద విగ్రహం, తర్వాత మరో విస్పోటనం.. ఇలా పంచభూతాలు, మూడు లోకాలు ఛాయలతో వీడియోని రూపొందించారు. విడుదల తేదిని కూడా చెప్పారు. 2025 సంక్రాంతికి కలుద్దామని ప్రకటించారు. సోషియో ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్గా ముస్తాబవుతోన్న ఈ సినిమాలో చిరు భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇందులో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయి. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు.
Beyond the universe and beyond the celestial realms, comes a light of hope – ???????????? ?#Mega156 is #Vishwambhara ❤️?
Title and concept video out now!
– https://t.co/BkWH5NqZ81In cinemas Sankranthi 2025.
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani… pic.twitter.com/NFsXoM0If7
— UV Creations (@UV_Creations) January 15, 2024