ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణ తీరు కామెడీ అవుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా కురదరు రానని చెప్పేశారు. దాంతో ఆయనను అరెస్టు చేయాలా వద్దా అన్న దానిపై ఈడీ ఊగసలాడుతోంది. ఆయన సీఎం హోదాలో ఉన్నారు. ఆయనకు కొన్ని రాజ్యాంగ పరమైన రక్షణలు ఉంటాయి. అందుకే తటపటాయిస్తున్నారు. లేకపోతే సిసోడియా దగ్గరకే పంపించి ఉండేవారు. ఇప్పుడు కవిత కూడా ఈడీని అలాగే లైట్ తీసుకుంటున్నారు.
తనను విచారణ చేయవద్దని సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉందని అందుకే తనను పిలువవొద్దని.. తాను రానని నోటీసులకు సమాధానం ఇచ్చారు. తనను ఇంటి వద్దే విచారించాలని కవిత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నేరాల్లో విచారణల విషయంలో మహిళలకు చాలా వెసులుబాట్లు ఉండాలని ఆమె తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఆ కేసులో విచారణకు పిలవకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి నవంబర్‌కు వాయిదా వేసింది. కానీ మళ్లీ ఆ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ కవితను విచారణకు రావాలని ఈడీ పిలిచింది.
తనకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల రక్షణ ఉన్నందున తాను రానని కవిత చెబుతున్నారు. కేజ్రీవాల్‌కు సీఎం ప దవి రక్షణగా ఉన్నట్లే కవితకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు రక్షణగా ఉన్నాయి. ఈ విషయంలో ఈడీ ఎలాంటి దూకుడు చూపిస్తుందో తెలియాల్సి ఉంది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో దర్యాప్తు సంస్థలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.