నేను వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావు అని జగన్ రెడ్డి తనను అవమానించారని ఆ పార్టీకి రాజీనామా చేసినప్పుడు వంగవీటి రాధాకృష్ణ జగన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకున్నారు వగవీటి రాధాకృష్ణ. వైసీపీలో చేరాలని కాళ్ల బేరానికి వచ్చిన వైసీపీకి చూసి చూసి గట్టి షాకిచ్చారు. పార్టీలో చేరేది లేదని.. కాస్తంత సిగ్గు, ఆత్మగౌరవం ఉంటే మీరే టీడీపీలోకి రావాలని వైసీపీ నేతలకు సలహా ఇచ్చారు. గత రెండు వారాలుగా వంగవీటి రాధా గురించి నీలి, కూలి మీడియా రూమర్స్ ప్రచారం చేస్తోంది. దానికి సరైన టైమ్లో సరైన సమాధానం ఇచ్చారు వంగవీటి రాధాకృష్ణ.
2019కి టిక్కెట్ ఇవ్వకుండా.. వంగవీటి రంగాపై గౌతంరెడ్డి వంటి వారితో తప్పుడు విమర్శలు చేయించడమే కాకుండా.. రాజకీయంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. నియోజకవర్గం లేకుండా చేశారు. చివరికి టిక్కెట్ ఎగ్గొట్టేందుకు నిందలు వేశారు. రంగా విగ్రహావిష్కరణకూ వెళ్లవద్దని ఆంక్షలు పెట్టారు. అలాంటి వంగవీటి రాధా లేకపోతే ఇప్పుడు వైసీపీ గెలవదని అర్థమైపోయింది. ఆయనను మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ప్రతిపాదనలు పంపుతున్నారు. ఏది కావాలంటే ఆ సీటు ఇస్తామని ఆర్థికంగా ఖర్చులు పెట్టుకుంటామని రాయబారం పంపుతున్నారు.
వంగవీటి రాధాకృష్ణకు.. మాజీ మంత్రి కొడాలి నాని స్నేహితుడు. ఇటీవల తన తండ్రి వర్థంతి సందర్భంగా పూజలు చేయడానికి వంంగవీటి రాధాకృష్ణ కాశీ వెళ్లారు. అప్పుడు కొడాలినాని కూడా వెళ్లారు. అక్కడి ఫోటోల వ్యూహాత్మకంగా రిలీజ్ చేసి.. పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని చేశారు. కొడాలి నాని కూడా .. జగన్ రెడ్డి తరపున రాయబారం నడిపారు. కానీ.. వంగవీటి రాధా మాత్రం…వైసీపీలోకి వచ్చే ప్రశ్నే లేదని తేల్చేశారు.