తెలగాణ అంటే కేసీఆర్ ఫ్యామిలీనే.. తెలంగాణ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితినే తమను ఎవరు అన్నా తెలంగాణను అన్నట్లుాగనే రాజకీయాలు చేసిన బీఆర్ఎస్ తమ స్ట్రాటజీలోని లోపాల్ని తామే బయట పెట్టుకుంటోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంగ్లిష్ సరిగ్గా రాదంటూ.. దావోస్లో ఆయన మీడియా ఇంటర్యూల్లో చెప్పిన మాటల్ని ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఆయన చెప్పిన ఉదాహరణలకు లేనిపోని ఉద్దేశాలు ఆపాదించి ఆయనను కించ పరుస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నేత కాదు. ఆ హోదాలో దావోస్ వెళ్లలేదు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. .ఈ హోదాలో తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్లారు. పెద్ద ఎత్తున మల్టినేషనల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియాకు మాత్రం ఆయన ఇంగ్లిష్ ను చూపించి కించపర్చడం మాత్రమే చేస్తోంది. తాము రేవంత్ ను కించ పర్చడం లేదని.. తెలంగాణను కించ పరుస్తున్నామని వారు అనుకోవడం లేదు.
తెలంగాణ వాయిస్ తామే అన్నట్లుగా తాము తెస్తేనే పెట్టుబడులన్నట్లుగా ఇప్పటి వరకూ బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది కానీ దావోస్లో అంతకు మించి అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. నిజానికి దావోస్ లో ఇంగ్లిష్ అధికారిక భాష కాదు. అక్కడంతా ఇంగ్లిష్ లోనేమాట్లాడరు. సగం మంది అక్కడికి వచ్చే ప్రతినిధులకు ఇంగ్లిష్ రాదు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా ఇంగ్లిష్ మాత్రమే గొప్ప అర్హత అన్నట్లుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. నేరుగా తెలంగాణ సీఎం ను అంటే.. తెలంగాణను కించ పరుస్తున్నారు.