జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఐదేళ్ల పాటు ఆయన తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితమయ్యారు. బటన్ నొక్కే పేరుతో బహింగసభలు పెట్టి రాజకీయ విమర్శలు చేయడానికి పరదాలు కట్టుకుని రావడం తప్ప ఈ ఐదేళ్లలో ప్రజల్ని కలిసింది లేదు.. సమస్యలను పరిష్కరించిందీ లేదు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడటంతో బహింగసభలు ప్రారంభించాలనుకుంటున్నారు. ఇరవై ఐదో తేదీన భీమిలి నుంచి సభలు ప్రారంభిస్తున్నారు.
మొదట భీమిలిలో ప్రారంభిస్తారు. తర్వాత ఎప్పుడు ఎక్కడ జరుగుతుదో మాత్రం స్పష్టత లేదు. రోజుకు రెండు చొప్పున వందసభల్లో పాల్గొంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏపీ ఎన్నికలు మొదటి విడతలోనే ఉంటాయి. విరామం లేకుండా రోజూ రెండు సభలు పెట్టినా యాభై రోజుల సమయం అవసరం. కానీ జగన్ రెడ్డికి ఒక్క సభ పెడితే మూడు, నాలుగు రోజులు రెస్ట్ తీసుకునే సంప్రదాయం ఉంది. గతంలోలా ఆయన ఇప్పుడు లేరు. చూసి చదవలేక ఇబ్బంది పడుతున్నారు. చెప్పిందే చెప్పాల్సి వస్తున్నా ఆయనకు కంఠతా రావడం లేదు. ఈ క్రమంలో వంద సభల పేరుతో ప్రచారం చేసినా ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ ఎప్పుడో ఓ సభ పెట్టి ఆ తర్వాత కొన్నినియోజవర్గాల్లో పర్యటిస్తారని .. అంతకు మించి శ్రమ తీసుకోరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అన్నాక ప్రజల్ని కలవకపోతే ఎలా నమ్ముతారన్న ప్రశ్న సహజంగానే వస్తోంది.
అయినా ప్రజలతే మనకేంటి పని అన్నట్లుగా ఉన్నారు వైసీపీ నేతలు. రేపు ప్రచారం కూడా సీఎం జగన్ తూ తూ మంత్రంగానే చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు జగన్ రెడ్డి చేయబోయే ప్రచారం ఖర్చు కూడా ఏదో ఓ కార్యక్రమం పేరు చెప్పి ప్రభుత్వ ఖాతాలో అంటే.. ప్రజల ఖాతాలో రాసేస్తారా అన్న సందేహాలే ఎక్కువగా వస్తున్నాయి. రాసినా ఇప్పుడు ఎవరూ అడిగేవారు లేరు. కోర్టులకు వెళ్లినా వాయిదాల పద్దతితో వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.