దేశంలోనే అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2022-23లో కేరళ జనాభాలో అరశాతం కంటే తక్కువ మంది పేదలు ఉన్నారు. 2005-06లో కేరళ జనాభాలో 12.31 శాతం మంది పేదలు ఉండగా అది 0.48 శాతానికి తగ్గింది. పోషకాహార లభ్యత, శిశు మరణాల రేటు, విద్య, పారిశుధ్యం, విద్యుత్తు, నివాసం, వంట ఇంధనం, బ్యాంకు ఖాతా వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని పేదరిక స్థాయిని లెక్కించారు.
బీహార్ లో 26.59 శాతం పేదరికంతో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 4.19 శాతం పేదలు ఉన్నారు. తెలంగాణోల మూడు శాతం ున్నారు. నివేదిక ప్రకారం, గత రెండు దశాబ్దాల్లో దేశంలో పేదరికం గణనీయంగా తగ్గింది. 2005-06లో 55.34 శాతం నుంచి 2022 -23లో 11.28 శాతానికి తగ్గింది. పేదరికం లెక్కించడానికి ఎంచుకున్న పారామీటర్స్ పై వివాదాలు ఉన్నా…ఎలాంటి లెక్కలు వేసినా కేరళ పేదలు లేని రాష్ట్రంగా ఉంటుంది.
తలసరి ఆదాయమని.. మరొకటని చెప్పి ప్రభుత్వాలు ప్రజల్ని మభ్య పెడుతూ ఉంటాయి కానీ..దేశంలో జీవన ప్రమాణాల ప్రకారం చూస్తే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంకు తగ్గట్లుగా మధ్యతరగతి ఆదాయం పెరగ్డం లేదు. రాను రాను వారి ఆదాయం పడిపోతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతికి పడిపోతున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. రేషన్ కార్డుల లెక్క చూస్తే ఏపీలో వంద శాతం పేదలు ఉంటారు.